శంషాబాద్ ఎయిర్ పోర్టులో చరిత్రలో తొలిసారి

|

Oct 21, 2023 | 10:00 AM

ఎన్నికలు కోడ్‌ అమలులోకి వచ్చినప్పటినుంచి రాష్ట్రంలో పోలీసులు నిఘా పెంచారు. ప్రతి చెక్‌పోస్ట్‌లోనూ తనిఖీలు చేస్తున్నారు. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ బంగారం, నగదు పెద్ద మొత్తంలో పట్టుబడుతూనే ఉన్నాయి. తాజాగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో బంగారం స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్‌ అధికారులు. అయితే ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే.. సాధారణంగా విదేశాలనుంచి భారత్‌కు బంగారం అక్రమంగా తీసుకురావడం ఇంతవరకూ చూశాం.

ఎన్నికలు కోడ్‌ అమలులోకి వచ్చినప్పటినుంచి రాష్ట్రంలో పోలీసులు నిఘా పెంచారు. ప్రతి చెక్‌పోస్ట్‌లోనూ తనిఖీలు చేస్తున్నారు. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ బంగారం, నగదు పెద్ద మొత్తంలో పట్టుబడుతూనే ఉన్నాయి. తాజాగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో బంగారం స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్‌ అధికారులు. అయితే ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే.. సాధారణంగా విదేశాలనుంచి భారత్‌కు బంగారం అక్రమంగా తీసుకురావడం ఇంతవరకూ చూశాం. చరిత్రలో తొలిసారి భారత్‌ నుంచి విదేశాలకు బంగారం తరలిస్తున్నారు. హైదరాబాద్- శంషాబాద్ నుంచి అబుదాబి వెళ్లేందుకు వచ్చిన శ్రీరంగప్ప అనే ప్రయాణికుడి వద్ద కిలోన్నర అక్రమ బంగారాన్నిగుర్తించారు సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు. నిందితుడి లగేజీని స్క్రీనింగ్ చేయగా అందులో కిలోన్నర బంగారం బిస్కెట్లను గుర్తించారు. బంగారం స్వాధీనం చేసుకున్న సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులు నిందితుడిని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. స్వదేశం నుంచి విదేశాలకు తరలిస్తూ అక్రమ బంగారం పట్టుబడడం ఎయిర్ పోర్ట్ చరిత్రలోనే మొదటిసారి అంటున్నారు అధికారులు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Singer Geetha Madhuri: గీతా మాధురితో విడాలకుల న్యూస్‌ !! నందు రియాక్షన్ !!

Prabhas: అంబరాన్ని అంటేలా సంబరాలు.. ప్రభాస్‌ బర్త్‌డే అంటే మామూలుగా ఉండదు మరి

Leo: డే1 115 కోట్లు.. దిమ్మతిరిగే హిస్టరీ క్రియేట్ చేసిన విజయ్‌

Salaar: సలార్‌ నుంచి బిగ్‌ లీక్ !! ట్విస్ట్ రివీల్ అయిపోయిందిగా !!