గుమ్మడికాయకు వేలంపాట.. ఎంత ధర పలికిందో తెలిస్తే మైండ్ బ్లాంకే !!

గుమ్మడికాయకు వేలంపాట.. ఎంత ధర పలికిందో తెలిస్తే మైండ్ బ్లాంకే !!

Phani CH

|

Updated on: Sep 16, 2022 | 9:40 AM

గణపతి నవరాత్రుల్లో నిమజ్జనం రోజున లడ్డూ వేలం పాట వేయడం చూసాం. కానీ ఇప్పుడు గుమ్మడికాయకు వేలం పాట వైరల్ అవుతోంది. ఎహె... గుమ్మడికాయకు వేలం ఏంటి?

గణపతి నవరాత్రుల్లో నిమజ్జనం రోజున లడ్డూ వేలం పాట వేయడం చూసాం. కానీ ఇప్పుడు గుమ్మడికాయకు వేలం పాట వైరల్ అవుతోంది. ఎహె… గుమ్మడికాయకు వేలం ఏంటి? మార్కెట్‌కి వెళ్లి ఓ 500 రూపాయలు పెడితే ఇంత పెద్ద గుమ్మడికాయ దొరుకుతుంది అనుకుంటున్నారా.. అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే వినాయకచవితిలో గణపతి లడ్డూకు ఎంత క్రేజ్ ఉందో కేరళలో ఓనం పండుగ సందర్భంగా నిర్వహించే వేలానికి అంతే క్రేజ్ ఉంది. మరి ఆ గుమ్మడికాయ వేలం సంగతేంటో చూద్దాం రండి. రళలో ఇడుక్కిలోని కొండ ప్రాంతంలో చెమ్మన్నార్ అనే గ్రామం ఉంది. ఆగ్రామంలో ఓనం పండగ సందర్భంగా బహిరంగ వేలం నిర్వహించారు. ఈవేలంపాటలో 5కిలోల బరువున్న గుమ్మడికాయను ఏకంగా 47,000 రూపాయలకు పాడి దక్కించుకున్నాడు ఓ వ్యక్తి. సాధారణంగా ఈవేలంలో పొట్టేళ్లు, కోళ్లు ధర వేలల్లో పలుకుతాయి. కానీ ఈసారి గుమ్మడికాయకు భారీ ధర పలికింది. దీంతో నిర్వహకులు ఆనందం వ్యక్తం చేస్తుండగా.. నెటిజన్లు మాత్రం ఈగుమ్మడికాయలో స్పెషల్ ఏంటో.. ఇంత ధర పలికిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బోనులోనే ఉంది కదా అని షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు !! తర్వాత సింహం ఇచ్చిన ట్విస్ట్ కు షేక్ అయ్యాడు

మగాళ్లకు మాత్రమే.. పెళ్లిని మించి గ్రాండ్‌గా విడాకుల పార్టీ

Viral: అబ్బో వీడి వేశాలో.. షార్క్‌తోనే ఏకంగా రోమాంటిక్ డాన్స్

Published on: Sep 16, 2022 09:40 AM