Viral: షాకింగ్.. నాలుక కోసి అమ్మవారికి సమర్పించిన భక్తుడు !!
భార్యతో కలిసి అమ్మవారి దర్శనం కోసం ఆలయానికి వచ్చిన ఓ వ్యక్తి తన నాలుకను కోసి అమ్మవారికి సమర్పించాడు. ఈ హఠాత్‌పరిణామానికి మిగతా భక్తులు నిర్ఘాంతపోయారు.
భార్యతో కలిసి అమ్మవారి దర్శనం కోసం ఆలయానికి వచ్చిన ఓ వ్యక్తి తన నాలుకను కోసి అమ్మవారికి సమర్పించాడు. ఈ హఠాత్‌పరిణామానికి మిగతా భక్తులు నిర్ఘాంతపోయారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని కౌశంబీలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక పట్టణానికి చెందిన సంపత్, బన్నోదేవి భార్యభర్తలు. వీరిద్దరూ కలిసి శక్తిపీఠమైన కదాధామ్‌లోని శీతలామాత ఆలయానికి వెళ్లారు. భార్యభర్తలిద్దరూ గంగానదిలో స్నానమాచరించి, పూజలు నిర్వహించారు. అనంతరం తన వెంట తెచ్చుకున్న బ్లేడుతో సంపత్ తన నాలుకను కోసి అమ్మవారికి సమర్పించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆలయం వద్దకు చేరుకుని సంపత్‌ను కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం జిల్లా ఆసుపత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం వల్ల అతడి పరిస్థితి విషమంగా మారినట్టు కౌశంబి జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ దీపక్ సేథ్ తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుమ్మడికాయకు వేలంపాట.. ఎంత ధర పలికిందో తెలిస్తే మైండ్ బ్లాంకే !!
బోనులోనే ఉంది కదా అని షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు !! తర్వాత సింహం ఇచ్చిన ట్విస్ట్ కు షేక్ అయ్యాడు
మగాళ్లకు మాత్రమే.. పెళ్లిని మించి గ్రాండ్‌గా విడాకుల పార్టీ
Viral: అబ్బో వీడి వేశాలో.. షార్క్‌తోనే ఏకంగా రోమాంటిక్ డాన్స్