Old Woman: ఫిట్‌నెస్‌లో అమ్మమ్మకు మనవడి ఛాలెంజ్‌..ఇట్టే ఎత్తిపడేసిన బామ్మ సత్తాకు నెటిజన్లు ఫిదా..

Updated on: May 28, 2022 | 8:10 PM

వృద్ధాప్యంలో ఇంట్లోనే ఉంటూ, ఆధ్యాత్మికత చింతనతో కాలక్షేపం చేస్తుంటారు చాలామంది. వయస్సు శరీరానికి మాత్రమే. మనస్సు ఎల్లప్పుడూ మానసిక ఆరోగ్యంతో ఉంటుందని కొందరు చేసే కొన్ని పనులను చూస్తే అర్థం అవుతుంది..


వృద్ధాప్యంలో ఇంట్లోనే ఉంటూ, ఆధ్యాత్మికత చింతనతో కాలక్షేపం చేస్తుంటారు చాలామంది. వయస్సు శరీరానికి మాత్రమే. మనస్సు ఎల్లప్పుడూ మానసిక ఆరోగ్యంతో ఉంటుందని కొందరు చేసే కొన్ని పనులను చూస్తే అర్థం అవుతుంది.. అసాధ్యం అనుకున్న పనులను అవళీలుగా చేస్తున్న అమ్మమ్మలు, తాతలు చాలా మందే ఉన్నారు. 80ఏళ్ల బామ్మ భారీ కసరత్తు చేస్తోంది. అతి బరువైన ఎక్సర్‌సైజ్‌ సాధనాన్ని అతిసులువుగా ఎత్తేస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంటర్‌ నెట్‌లో చేరిన ఈ వీడియో నెటిజన్లు షాకింగ్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. అమ్మమ్మ చేసిన స్టంట్స్‌కు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.ఎనభై ఏళ్ల వయసున్న ఓ బామ్మ చేస్తున్న స్టంట్స్‌ అందరిని ఆకట్టుకుంటోంది. ఆమె తన మనవడి ‘ఛాలెంజ్’ స్వీకరించింది. దాన్ని ఆ అమ్మమ్మ చాలా తేలిగ్గా చేసేసింది. వర్కవుట్లలో కాస్త భారీ అనుకున్న డెడ్ లిఫ్ట్ చేసి చూపించడమే మనవడి ఛాలెంజ్.. బామ్మగారు దాన్ని చాలా సింపుల్‌గా చేశారు. ఈ వీడియో పంజాబీ ఇండస్ట్రీ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్‌ చేశారు. తాజాగా ఇది ఇంటర్‌నెట్‌ని షేక్‌ చేస్తోంది. ఇది చూసిన యువకులంతా ఏం మాస్ మామ్మరా బాబు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?

Child cooking: ఈ బుడ్డోడు గరిటపడితే బాల భీముడే.. బుడతడి వంటకు నెటిజన్లు ఫిదా..!

 

Published on: May 28, 2022 08:10 PM