Old man: ఓ తాత.. ఎం కావాలి..? గూగుల్ ను అడుగుతున్న తాత.. నవ్వుకుంటున్న నెటిజన్స్..
ఓ పెద్దాయన తన ఇంటి ఆవరణలో బల్ల మీద కూర్చుని మొబైల్ ఫోన్ చూస్తున్నాడు. తనకు అవసరమైన ఏదో ప్రశ్నను గూగుల్‌ను అడుగుతున్నాడు. ఈ క్రమంలో అయాన గూగుల్ అనడానికి
ఓ పెద్దాయన తన ఇంటి ఆవరణలో బల్ల మీద కూర్చుని మొబైల్ ఫోన్ చూస్తున్నాడు. తనకు అవసరమైన ఏదో ప్రశ్నను గూగుల్‌ను అడుగుతున్నాడు. ఈ క్రమంలో అయాన గూగుల్ అనడానికి బదులు టంగ్ స్లిప్ అయి హలో గుల్ గుల్ అంటూ విష్ చేస్తాడు. అయితే తాతగారు పొరబాటుగా పలికినందుకు గూగుల్‌కి క్షమాపణ కూడా చెప్పారు. ఈ క్రమంలో ఆయన అడిగింది అర్ధం కాలేదో, లేక తాతగారు అడిగిన దానికి తన దగ్గర సమాధానం లేదో కానీ గూగుల్ సైలెంట్‌గా ఉండిపోయింది. ఈ ఫన్నీ వీడియోను అమిత్ అత్రి అనే వినియోగదారు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. వినోదం ఎంత దూరం వెళ్లిందో చూస్తూనే ఉండండి.. అనే క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను 40 లక్షల మందికి పైగా వీక్షించారు. లక్షమందికి పైగా లైక్ చేశారు. చాలా మంది నెటిజన్లు తమాషాగా స్పందించారు. ఒకరు గూగుల్‌ని ఉద్దేశించి.. “నా అధికారాలు దుర్వినియోగం అవుతున్నాయి” అని చమత్కరించారు. నేను ‘గుల్‌గుల్‌ని గుర్తు చేసుకుంటూ మళ్లీ మళ్లీ నవ్వుతున్నాను’ అని మరొకరు రాశారు. మొత్తంమీద ఈ తాతగారు గుల్ గుల్ అందరికీ తెగ నచ్చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos