oil Loory: లోడుతో వెళుతున్న ఆయిల్‌ ట్యాంకర్‌ బోల్తా.. బకెట్లతో ఎగబడిన జనం.. వైరల్ వీడియో..

|

Jul 23, 2022 | 10:02 AM

పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చల్లగుండ్ల వద్ద ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకెళ్తున్న ఆయిల్‌ ట్యాంకర్‌ అదుపుతప్పి బోల్తా కొట్టింది.


పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చల్లగుండ్ల వద్ద ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకెళ్తున్న ఆయిల్‌ ట్యాంకర్‌ అదుపుతప్పి బోల్తా కొట్టింది. చెన్నై నుంచి హైదరాబాద్‌కు ఆయిల్ లోడుతో వస్తున్న ట్యాంకర్‌ చల్లగుండ్ల వద్ద అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. దాంతో పెద్ద ఎత్తున స్థానికులు గుమిగూడారు. ఆయిల్‌ ట్యాంకర్‌ బోల్తా కొట్టడంతో ఆయిల్ మొత్తం నేలపాలైంది. ఈ క్రమంలో స్థానికులంతా బకెట్లు, క్యాన్లతో ఎగబడ్డారు. అందికాడికి ఆయిల్‌ బకెట్లలో నింపుకునేందుకు పోటీ పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆయిల్‌ ట్యాంకర్‌ను అక్కడినుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Aliens Kidnap: నన్ను నా భార్యను ఏలియన్స్‌ కిడ్నాప్‌ చేశాయ్‌.. అందుకే భవిష్యత్తు ముందే నాకు తెలుస్తోంది.!

Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..

Published on: Jul 23, 2022 09:55 AM