Taiwan Earthquake: తైవాన్‌ భూకంపం.! నవజాత శిశువుల కోసం నర్సుల ఆరాటం..

|

Apr 08, 2024 | 8:19 AM

తైవాన్ భూకంపం సమయంలో కనిపించకుండా పోయిన భారతీయులు క్షేమంగానే ఉన్నారని విదేశాంగ శాఖ గురువారం తెలిపింది. భూకంప సమయంలో ఇద్దరు భారతీయులతో సంబంధాలు తెగిపోయాయనీ వారితో ఇటీవలే మాట్లాడామని.. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు. తైవాన్‌లో బుధవారం భారీ భూకంపం సంభవించింది. హువెలిన్ కౌంటీలో రిక్టర్‌ స్కేలుపై 7.2 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం

తైవాన్ భూకంపం సమయంలో కనిపించకుండా పోయిన భారతీయులు క్షేమంగానే ఉన్నారని విదేశాంగ శాఖ గురువారం తెలిపింది. భూకంప సమయంలో ఇద్దరు భారతీయులతో సంబంధాలు తెగిపోయాయనీ వారితో ఇటీవలే మాట్లాడామని.. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు. తైవాన్‌లో బుధవారం భారీ భూకంపం సంభవించింది. హువెలిన్ కౌంటీలో రిక్టర్‌ స్కేలుపై 7.2 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం కారణంగా సుమారు 10 మంది మరణించగా వందల సంఖ్కలో ప్రజలు గాయపడ్డారు. మరో 12 మంది ఆచూకీ కోసం విస్తృత గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఓ ఆస్పత్రిలోని ప్రసూతి విభాగంలో నర్సులు నవజాత శిశువుల ప్రాణాల కోసం పడిన ఆరాటం అంతా ఇంతా కాదు. వీడియోను ఆస్పత్రికి చెందిన ఒక నర్సు షేర్ చేశారు. ఆమె, సహచర నర్సులు శిశువుల ఊయలన్నింటినీ ఒక చోటకు చేర్చి, వాటిని కదలకుండా పట్టుకునే ప్రయత్నం చేశారు. భూకంపం కారణంగా బిల్డింగ్ మొత్తం ఊగిపోతున్నా ఈ నర్సులు పిల్లల ఊయలలను గట్టిగా పట్టుకోవడం వీడియోలో కనిపిస్తుంది. గదిలోని కిటికీ పగిలి పిల్లలకు గాయాలవుతాయోమోనని వారు ఆందోళన చెందారు. భూకంపం కారణంగా తైవాన్‌లో పలు భవనాలు పక్కకు ఒరిగిపోయాయి. భూకంపానికి ఊగిపోతున్న భవంతులు, బ్రిడ్జీలు, ప్రజల హాహాకారాల తాలూకు వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, రెండు భూపలకాల సరిహద్దులో ఉండే తైవాన్‌లో భూకంపాలు సాధారణమేనని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..