విశాఖ అబ్బాయి వెడ్స్‌ నార్వే అమ్మాయి

Updated on: Jan 20, 2026 | 9:45 AM

విశాఖకు చెందిన సైమన్, నార్వే అమ్మాయి తూరా ప్రేమ కథ ఇది. నార్వేలో ఉద్యోగం చేస్తున్న సైమన్‌కు అక్కడ తూరాతో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. వారిద్దరూ హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వధువు కుటుంబసభ్యులు విశాఖకు వచ్చి, ఇరు కుటుంబాల సమక్షంలో ఘనంగా నిశ్చితార్థం జరిగింది. విదేశాల్లో తెలుగు యువకులు ప్రేమించి పెళ్లి చేసుకునే ఈ ట్రెండ్ పెరుగుతోంది.

వారిద్దరి దేశాలు వేరు.. అయినా మనసులు కలిశాయి. ఇంకేముందీ.. ఇద్దరు ఒక్కటయ్యారు. యూరోప్ దేశమైన నార్వేకి చెందిన అమ్మాయి.. ఇక్కడి అబ్బాయి.. హిందూ సంప్రదాయ ప్రకారం ఒక్కటిగా అయ్యారు. ఇటీవలి కాలంలో ఉపాధి కోసం విదేశాలకు వెళ్లడం.. అక్కడ యువతులతో ప్రేమలో పడటం.. ఆ తర్వాత ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లిళ్లు చేసుకోవడం పరిపాటిగా మారింది. ఇందులో తెలుగు వారే ఎక్కువగా ఉండటం విశేషం. విశాఖకు చెందిన సైమన్ ఉపాధి కోసం నార్వే వెళ్ళాడు. 2016 నుంచి అక్కడే బ్యాంకు లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆ ప్రాంతంలో రెండేళ్ల క్రితం మ్యూజిక్ క్విజ్ లో తూరా అనే యువతి తో పరిచయం ఏర్పడింది. ఆమె స్పీచ్ థెరపిస్ట్ గా పని చేస్తొంది. ఇద్దరి మనసులు కలిసాయి. రెండేళ్ల డేటింగ్ తరువాత ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. పెద్దలకు విషయం చెప్పారు. సానుకూలంగా స్పందించండంతో.. ఇక నిశ్చితార్ధానికి ఫిక్స్ అయ్యారు. వధువు పేరేంట్స్ విశాఖ వచ్చారు. భారతీయుల్లో కనిపించే ప్రేమ, ఆప్యాయతలు చూసి వధువు కుటుంబ సభ్యులు ఫిదా అయ్యారు. విశాఖలో గ్రాండ్‌గా నిశ్చితార్ధం జరిగింది. ఇరు కుటుంబాలతోపాటు బంధువులు స్నేహితులు కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. తన కోడలిని భారతీయ సంప్రదాయ వస్త్రధారణలో చూడాలన్న ఆశతో తొలి బహుమతిగా చీరను అందించారు వరుడి తండ్రి జ్ఞాన్ ప్రకాష్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గొర్రె రక్తానికి అంత పవర్ ఉందా.. అసలు నిజాలు తెలిస్తే షాకవుతారు

ఎండు చేపలను ఇష్టంగా తింటున్నారా.. డేంజర్‌ సుమా

Deepika Padukone: 40 ఏళ్లలో ఫిట్‌గా దీపిక.. రోజూ భోజనంలో ఇవి ఉండాల్సిందే

జుట్టు రాలిపోతోందా.. ఈ డ్రింక్‌ ట్రై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం

ఎముకలకు పుష్టినిచ్చే ఆహారాలు ఇవే