ఇంజిన్‌ లేకుండానే కదిలిన రైలు !! ఆశ్చర్యంలో రైల్వే అధికారులు

|

Sep 07, 2023 | 9:41 AM

రైలు ఇంజిన్‌ లేకుండానే రైలు బోగీలు వేగంగా కదిలాయి. రోడ్డు, రైల్వే క్రాసింగ్‌ను దాటి రైల్వే స్టేషన్ వద్దకు చేరుకున్నాయి. అది చూసి స్థానినికులు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. ఊహించని ఈ ఘటనతో రైల్వే అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. దానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన జార్ఖండ్‌ సాహిబ్‌గంజ్ జిల్లాలోని మాల్దా రైల్వే డివిజన్ పరిధిలో చోటుచేసుకుంది. బార్హర్వా రైల్వే స్టేషన్‌ సమీపంలో గూడ్స్‌ రైళ్లు

రైలు ఇంజిన్‌ లేకుండానే రైలు బోగీలు వేగంగా కదిలాయి. రోడ్డు, రైల్వే క్రాసింగ్‌ను దాటి రైల్వే స్టేషన్ వద్దకు చేరుకున్నాయి. అది చూసి స్థానినికులు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. ఊహించని ఈ ఘటనతో రైల్వే అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. దానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన జార్ఖండ్‌ సాహిబ్‌గంజ్ జిల్లాలోని మాల్దా రైల్వే డివిజన్ పరిధిలో చోటుచేసుకుంది. బార్హర్వా రైల్వే స్టేషన్‌ సమీపంలో గూడ్స్‌ రైళ్లు సరుకులు లోడింగ్‌, అన్‌లోడింగ్‌ చేసే చోట పట్టాలపై ఒక రైల్వే వ్యాగన్‌, నాలుగు బోగీలు నిలిచి ఉన్నాయి. వాటికి ఇంజిన్‌ కూడా లేదు. కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆ బోగీలు పట్టాలపై దూసుకెళ్లాయి. ఈ ఘటన సెప్టెంబరు 3న జరిగింది. రైలును పట్టాలపై రివర్స్‌లో నడుపుతున్నట్టుగా చాలా వేగంగా ముందుకు వెళ్లాయి. అక్కడున్న రోడ్డు, రైల్వే క్రాసింగ్‌ను దాటుకుని, బార్హర్వా రైల్వే స్టేషన్‌ వద్దకు చేరుకుని అక్కడ ఆగిపోయాయి. ఈ ఘటన ఇటు స్థానికులను, రైల్వే సిబ్బంది, అధికారులను సైతం ఆశ్చర్యంలో పడేసింది. అక్కడే ఉన్న కొందరు సిబ్బంది రైలు పట్టాలపై వెళ్లిన ఆ రైలు వెంట పరుగులు తీశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళపై అఘాయిత్యం.. ఆపై అమ్మేసిన పోలీసులు

Follow us on