Water on wheels: నీళ్లను తోసుకెళ్లే వాటర్‌ వీల్స్‌ .. బిందె బాధ తప్పింది లేడీస్‌..!

|

May 18, 2022 | 8:54 AM

వేసవి వస్తే చాలు.. తాగునీటి కోసం నెత్తిన బిందెలు పెట్టుకుని, ఎర్రటి ఎండలో మైళ్ళకు మైళ్ళు నడిచే మహిళలకు వరం లాంటివి వాటర్‌ వీల్స్‌! బిందెపై బిందె పెట్టుకుని ఎగుడుదిగుడు దారుల్లో నడుస్తున్న కారణంగా...


వేసవి వస్తే చాలు.. తాగునీటి కోసం నెత్తిన బిందెలు పెట్టుకుని, ఎర్రటి ఎండలో మైళ్ళకు మైళ్ళు నడిచే మహిళలకు వరం లాంటివి వాటర్‌ వీల్స్‌! బిందెపై బిందె పెట్టుకుని ఎగుడుదిగుడు దారుల్లో నడుస్తున్న కారణంగా… వీరిలో చాలామంది మెడ, నడుము నొప్పులతో బాధపడుతున్నారు. రోజులో ఎక్కువ సమయం నీళ్లు తెచ్చుకోవడానికే సరిపోవడంతో మహిళలు ఎలాంటి ఉపాధి చేపట్టడం లేదు. బాలికలూ చదువులకు దూరమవుతున్నారు. ఈ పరిస్థితులను గమనించిన పలు స్వచ్ఛంద సంస్థలు… టెక్నాలజీ సాయంతో వాటర్‌ వీల్స్‌ తయారుచేసాయి. ఒకేసారి 50 లీటర్ల నీటిని నింపి సులభంగా తోసుకుపోవచ్చు. నాణ్యమైన ప్లాస్టిక్‌తో, ఎలాంటి నేలనైనా తట్టుకుని మన్నేలా వీటిని రూపొందించారు. వీటిలో నీళ్లు నింపి హ్యాండిల్స్‌ సాయంతో తోసుకెళ్ళవచ్చు. దీంతో నీళ్ల భారం తప్పి కొందరు బాలికలు బడిబాట పడుతున్నారు. మహిళలు ఉపాధి పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం వేసవి కావడంతో కొన్ని కార్పొరేట్‌ ఇంకా స్వచ్ఛంద సంస్థలు మారుమూల గ్రామాల్లోని పేద కుటుంబాలకు వీటిని అందిస్తున్నాయి. ఉచితంగా లేదంటే రాయితీ ధరలకే ఇస్తున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urfi Javed-Samantha: సమంత చూపిస్తే అందం.. నేను చూపిస్తే అసహ్యమా.. శృంగార తార షాకింగ్ కామెంట్స్..

Viral Video: భార్య శవంతో 21 ఏళ్లుగా సహాజీవనం.. చివరకు..! వీడియో చుస్తే హృదయం కదలాల్సిందే..!

Funny Video: అది లెక్క..! నిజంగా వేడు మగాడ్రా బుజ్జి.. అభినవ పరమానందయ్య శిష్యుడు..! చూస్తే పొట్టచెక్కలే..

Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..

Follow us on