Viral: 10 రోజులు లీవ్‌ అడిగిన ఎంప్లాయ్‌.. 2 నిమిషాల్లో ఓకే చెప్పిన బాస్‌.. ఇక్కడే అసలైన ట్విస్ట్.

|

Sep 16, 2023 | 9:37 PM

సాధారణంగా ఉద్యోగులకు కావలసినప్పడు లీవ్‌ దొరకడం కష్టమే. ఒకటీ రెండు రోజులైతే ఓకే.. కానీ అదే పది, పదిహేను రోజులైతే కొంచెం కష్టమే. ఓ మహిళకు ఎంతో ఈజీగా వాళ్ల బాస్‌ 10 రోజులు సెలవు ఇచ్చింది. ఆ తర్వాత రెండు మెసేజులు పంపింది. ఇప్పుడదే నెట్టింట వైరల్‌గా మారింది. ఆ మెసేజులపై నెటిజన్లు తమదైనశైలిలో కామెంట్లు చేస్తూ హోరిత్తిస్తున్నారు.తన బాస్ పూజ.. అడగ్గానే లీవ్ ఇచ్చారంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆకాంక్ష..

సాధారణంగా ఉద్యోగులకు కావలసినప్పడు లీవ్‌ దొరకడం కష్టమే. ఒకటీ రెండు రోజులైతే ఓకే.. కానీ అదే పది, పదిహేను రోజులైతే కొంచెం కష్టమే. ఓ మహిళకు ఎంతో ఈజీగా వాళ్ల బాస్‌ 10 రోజులు సెలవు ఇచ్చింది. ఆ తర్వాత రెండు మెసేజులు పంపింది. ఇప్పుడదే నెట్టింట వైరల్‌గా మారింది. ఆ మెసేజులపై నెటిజన్లు తమదైనశైలిలో కామెంట్లు చేస్తూ హోరిత్తిస్తున్నారు. తన బాస్ పూజ.. అడగ్గానే లీవ్ ఇచ్చారంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆకాంక్ష దుగాడ్ అనే మహిళ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఓ టూర్‌పై వేళ్లేందుకు తాను పది రోజుల సెలవు కోరుతూ మెసేజ్ పెట్టిన రెండో నిమిషంలో తన బాస్ లీవ్ శాంక్షన్ చేసారని ఆమె చెప్పుకొచ్చింది.అంతేకాదు.. బాస్ తనకు పెట్టిన వాట్సాప్ మెసేజీ స్క్రీన్ షాట్‌ను కూడా షేర్ చేసింది. ఆ స్క్రీన్‌ షాట్‌లో ఆమె బాస్‌ సెలవు శాంక్షన్‌ చేసిన తర్వాత వెంటవెంటనే రెండు మెసేజ్‌లు పెట్టి డిలీట్ చేసిన విషయాన్ని గుర్తించారు. ఈ డిలీటైన మెసేజీల్లోనే అసలు విషయం దాగి ఉందంటూ కామెంట్లు విసురుతున్నారు. ఆ మెసేజ్‌లు డిలీట్ చేయకుండా ఉండి ఉంటే బాస్ లీవ్ ఇచ్చిన వెనుక అసలు రహస్యం తెలిసి ఉండేదంటున్నారు. ఇక కొందరు డిలైటైన మెసేజీల్లో ఏమి ఉండొచ్చో చెబుతూ సెటైర్స్‌ వేశారు. పది రోజులేం ఖర్మ..శాశ్వతంగా సెలవు తీసుకో.. ఇక నువ్వు ఆఫీసుకు రానక్కర్లేదు అని ఆమె మెసేజ్ పెట్టి ఉంటుంది. మళ్లీ ఆలోచించి ఇప్పుడు కొత్త ఎంప్లాయిని ఎక్కడ పట్టుకురావడం కష్టం అనుకొని ఆ నిర్ణయం విరమించుకుని ఉంటుంది అని ఒకరు కామెంట్ చేశారు. మరొకరు ఆమె లీవ్‌పై వెళుతున్నందుకు తను 10 రోజులు మనశ్వాంతిగా ఉండొచ్చు అని వేరే వాళ్లకు మెసేజ్ పెట్టబోయి ఇక్కడ పోస్ట్ చేసి ఉంటుందంటూ మరొకరు పంచ్ వేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..