రూ.400 పెట్రోలు కొట్టించిన యువకుడు.. డౌట్ వచ్చి చెక్‌ చేయగా.. సీన్ రివర్స్

Updated on: Jul 10, 2025 | 9:09 PM

బండిలో పెట్రోలు అయిపోయిందని పెట్రోలు బంక్‌కి వెళ్లిన ఓ యువకుడు.. రూ.400లు ఇచ్చి పెట్రోలు పోయించుకున్నాడు. తిరిగి వెళ్లే క్రమంలో డౌట్ వచ్చి చూస్తే.. ట్యాంకులో ఎక్కడో అడుగున కాస్త పెట్రోలు కనిపించింది. ఇదేంటబ్బా అనుకుంటూ ఇంటికెళ్లి, బండిలో పెట్రోలును పైపుతో అందులోకి కార్చి చూస్తే..అర లీటరు కూడా రాకపోవటంతో షాకయ్యాడు.

నెల్లూరు జిల్లాలోని కొన్ని పెట్రోల్ బంకుల్లో నిర్వాహకులు చేతివాటం ప్రదర్శిస్తూ వినియోగదారుల జేబుకు చిల్లు పెడుతున్నారు. తాజాగా, బుచ్చిరెడ్డిపాలెంలోని ఓ పెట్రోల్ బంకులో 400 రూపాయలకు పెట్రోల్ కొట్టిస్తే కనీసం లీటరు కూడా రాకపోవడంతో వాహనదారుడు అవాక్కయ్యాడు. దీంతో ఇదేంటని అక్కడి సిబ్బందిని నిలదీయగా, వారు దాటవేసే సమాధానాలు చెప్పారు. జిల్లాలోని సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడటం వల్లే ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నాయని ఆ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. మీటర్‌లో చిప్ లు పెట్టి.. వాహనదారుల జేబులు గుల్లచేస్తున్నారని స్థానిక వాహనదారులు కూడా ఆరోపిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొంపముంచిన సోషల్‌ మీడియా పోస్ట్‌.. రూ.22 లక్షల ప్యాకేజీ జాబ్‌ గోవిందా

ఆ మాంసం తినేవాడు రాముడిగా ఎలా నటిస్తాడు !! రణ్‌బీర్ పై హిందూ సంఘాల ఆగ్రహం

కొడుకు తప్పుకు.. సారీ చెప్పిన స్టార్ హీరో

మనుషులకే దిక్కులేదంటే.. కుక్కకేమో గ్రాండ్‌గా బర్త్‌ డే పార్టీ…!

నాలుగో పెళ్లాం వచ్చిన వేళా విశేషం.. లాటరీ గెలిచిన నటుడు…