Viral: బిల్డింగ్‌ను ఢీకొని 1000 పక్షుల మృతి.. కారణమేంటంటే..? శాస్తవేత్తల విశ్లేషణ ఏంటంటే.?
అమెరికాలోని చికాగోలో ఇటీవల ఒక్కరోజులో 1000 పక్షులు మృతి చెందడం సంచలనం కలిగించింది. ఆ పక్షులు శీతాకాలపు వలస కోసం దక్షిణ అమెరికా మైదానాలకు తరలివెళ్లాయి. అక్కడి నుండి ఉత్తర అమెరికాకు తిరిగి వస్తుండగా, చికాగోలోని మెక్‌కార్మిక్ ప్లేస్ సమీపంలో ఒకటిన్నర మైళ్ల వ్యాసార్థంలో పక్షులు చనిపోయి కుప్పలుగా పడిపోయాయి. స్థానికులు ఆ పక్షులను ఆసుపత్రులకు తీసుకెళ్లారు.
అమెరికాలోని చికాగోలో ఇటీవల ఒక్కరోజులో 1000 పక్షులు మృతి చెందడం సంచలనం కలిగించింది. ఆ పక్షులు శీతాకాలపు వలస కోసం దక్షిణ అమెరికా మైదానాలకు తరలివెళ్లాయి. అక్కడి నుండి ఉత్తర అమెరికాకు తిరిగి వస్తుండగా, చికాగోలోని మెక్‌కార్మిక్ ప్లేస్ సమీపంలో ఒకటిన్నర మైళ్ల వ్యాసార్థంలో పక్షులు చనిపోయి కుప్పలుగా పడిపోయాయి. స్థానికులు ఆ పక్షులను ఆసుపత్రులకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు వాటి మరణానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. పక్షులు ఇలా చనిపోవడానికి కారణం అవి భవనాన్ని ఢీకొని కింద పడిపోవడమేనని నిపుణులు చెబుతున్నారు. భవనం సమీపంలో నేలకొరిగిన పక్షులలో మృతిచెందినవి, గాయపడినవి ఉన్నట్లు గుర్తించారు. దాదాపు 1.5 మిలియన్ పక్షులు ఈ ప్రాంతం నుంచి వలస వెళుతుంటాయి. వీటిలో టేనస్సీ వార్బ్లెర్స్, హెర్మిట్ థ్రష్‌లు, అమెరికన్ వుడ్‌కాక్స్, ఇతర రకాల సాంగ్‌బర్డ్‌లు ఉంటాయి.
యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆంటారియోలో కిటికీలకు తగిలి చనిపోయే పక్షులపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు కిటికీకి తగిలిన ప్రతి పక్షి చనిపోదని చెప్పారు. పక్షుల మరణాలకు గాలి, వర్షం, పొగమంచు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు కారణం కావచ్చన్నారు. ప్రతి సంవత్సరం ఒక బిలియన్ పక్షులు గాజు కిటికీలను ఢీకొనడంతో చనిపోతున్నాయని, పక్షులు అద్దంలో తమ ప్రతిబింబాన్ని చూసినప్పుడు, భయపడి కిందపడి చనిపోతాయని పరిశోధన జరిపిన శాస్త్రవేత్తలు తెలిపారు. ఇటువంటి సందర్భాల్లో కొన్ని పక్షులు గాయపడతాయన్నారు. భవనాల లైట్లు స్విచ్ ఆఫ్ చేయడం పక్షుల మరణాలను తగ్గించడానికి ఒక మార్గంమని తెలిపారు. చికాగోలో పక్షుల మరణాలపై 2021లో జరిపిన ఒక అధ్యయనంలో పెద్ద భవనాల్లో సగం లైట్లు ఆఫ్ చేయడం వల్ల పక్షులు ఢీకొనడం 6 నుంచి 11 రెట్లు తగ్గిందని తేలింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..