వరదలో చిక్కుకున్న బస్సు.. 22 మంది ప్రయాణికులు

Updated on: Sep 21, 2025 | 7:59 PM

ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో పెను ప్ర‌మాద‌ం తప్పింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గోవిందపల్లి వాగు వద్ద రూపనగుడి చెరువు ఉధృతంగా పొంగి ప్రవహిస్తుండటంతో రహదారిపైకి నీరు చేరింది. ఆ మార్గంలో వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వరద నీటిలో చిక్కుకుంది.

బస్సులో ప్రమాద సమయంలో 22 మంది ప్రయాణికులు ఉన్నారు. ఒక్కసారిగా నీటి మట్టం పెరగడంతో ప్రయాణికులు భయంతో గట్టిగా అరిచారు. స్థానిక అధికారులు వారిని రక్షించడం కోసం జేసీబీని రంగంలోకి దించారు. దాని సాయంతో అందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. సుంకేసుల డ్యామ్ నుంచి నీటిని అధికంగా విడుదల చేయడంతో ఉయ్యాలవాడ–జమ్మలమడుగు రహదారి పూర్తిగా మూసుకుపోయింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ ఘటన వరద ప్రభావిత ప్రాంతాలలో ఎంత అప్రమత్తంగా ఉండాలో గుర్తుచేసింది. అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసారు. వరద పోటెత్తి ప్రవహించే వాగులు, చెరువుల వద్దకు వెళ్లకూడదని ప్రజలకు సూచించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తిరుమలలో భక్తులను పరుగులు పెట్టిస్తున్న పాములు

అర్ధరాత్రి వేళ ఆకాశంలో మిరుమిట్లు గొలిపిన కాంతులు.. కారణం ఇదే

లక్ష రూపాయలకే 5 బుల్లెట్‌ బైక్‌లు.. కొనుగోలు బిల్లు వైరల్‌

ఇది కదా స్మార్ట్‌ వర్క్‌ అంటే.. అతని టెక్నిక్‌కి అవాక్కవ్వాల్సిందే

మమ్మీల పుట్టిల్లు ఈజిప్ట్ కాదు.. చైనా