Mysterious Tunnel: ఢిల్లీ అసెంబ్లీలో భారీ సోరంగం.. ఆ టన్నెల్‌ ఎవరు తవ్వారు..?? వీడియో

|

Sep 05, 2021 | 8:56 AM

దేశ రాజ‌ధాని ఢిల్లీలో భారీ సొరంగం బయటపడింది. ఢిల్లీ అసెంబ్లీ నుంచి ఎర్రకోటకు మార్గాన్ని పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. స్వాతంత్ర్య ఉద్యమకారులను అణచివేసేందుకు బ్రిటీష‌ర్లు ఈ సొరంగ మార్గం వినియోగించుకున్నట్లు తెలుస్తోంది.

దేశ రాజ‌ధాని ఢిల్లీలో భారీ సొరంగం బయటపడింది. ఢిల్లీ అసెంబ్లీ నుంచి ఎర్రకోటకు మార్గాన్ని పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. స్వాతంత్ర్య ఉద్యమకారులను అణచివేసేందుకు బ్రిటీష‌ర్లు ఈ సొరంగ మార్గం వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ శాసన సభ నుంచి ఎర్రకోట వ‌ద్దకు ఆ సొరంగ మార్గం ఉన్నట్లు గుర్తించారు. దేశాన్ని బ్రిటీష‌ర్లు పాలించిన స‌మ‌యంలో ఆ మార్గం ద్వారా స్వాతంత్ర్య సమరయోధులను తరలించేటప్పుడు ప్రతీకారం తీర్చుకోవడానికి బ్రిటిషర్లు దీనిని ఉపయోగించారని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ తెలిపారు. 1993లో ఎమ్మెల్యేగా ఎన్నికైన‌ప్పుడు తాను దీని గురించి వినేవాడిన‌ని, రెడ్ ఫోర్ట్‌కు అసెంబ్లీ నుంచి సొరంగ మార్గం ఉన్నట్లు చెప్పేవార‌ని, దాని చ‌రిత్ర గురించి తెలుసుకునే ప్రయ‌త్నం చేశాన‌ని, కానీ క్లారిటీ రాలేద‌ని రామ్ నివాస్ అన్నారు. అయితే, ఇప్పుడు ఆ ట‌న్నెల్‌కు చెందిన ముఖ‌ ప్రదేశాన్ని గుర్తించామ‌న్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Pulasa Fish: యానాంలో దర్శనమిచ్చిన పులసలు.. ఒక్కో చేప ఎంత ధర పలికిందో తెలిస్తే నోరెళ్లబెడతారు.. వీడియో

Sonu Sood: ప్రమాదకరమైన స్టంట్స్ చేసిన సోనూసూద్.. కట్ చేస్తే.. అసలు విషయం తెలిస్తే షాకవుతారు..

Pawan Kalyan: తమిళనాడు అసెంబ్లీ మారుమ్రోగిన పవన్‌ పేరు.. పవన్ ట్విట్‌తో సీఎం స్టాలిన్‌పై మంత్రి ప్రశంసల వర్షం.. వీడియో