Cheddi Gang: తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ ఎంట్రీ.! చెడ్డీ గ్యాంగ్ సీసీ కెమెరాల్లో గుర్తింపు..
ఏపీలో గతంలో భయభ్రాంతులకు గురిచేసిన చెడ్డీగ్యాంగ్ మరోమారు కలకలం రేపింది. తిరుపతి దాని శివారు ప్రాంతాల్లో ఈ గ్యాంగ్ సంచరిస్తున్నట్టు సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఈ నేపథ్యంలో ప్రజలకు పోలీసులు పలు హెచ్చరికలు జారీ చేశారు. చెడ్డీగ్యాంగ్ సంచరిస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి సమయాల్లో కాలింగ్ బెల్ కొట్టినా, తలుపులు తట్టినా ఎట్టి పరిస్థితుల్లోనూ తీయవద్దని హెచ్చరించారు.
ఏపీలో గతంలో భయభ్రాంతులకు గురిచేసిన చెడ్డీగ్యాంగ్ మరోమారు కలకలం రేపింది. తిరుపతి దాని శివారు ప్రాంతాల్లో ఈ గ్యాంగ్ సంచరిస్తున్నట్టు సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఈ నేపథ్యంలో ప్రజలకు పోలీసులు పలు హెచ్చరికలు జారీ చేశారు. చెడ్డీగ్యాంగ్ సంచరిస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి సమయాల్లో కాలింగ్ బెల్ కొట్టినా, తలుపులు తట్టినా ఎట్టి పరిస్థితుల్లోనూ తీయవద్దని హెచ్చరించారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు. రాష్ట్రంలో చెడ్డీగ్యాంగ్ మూడేళ్లుగా తిరుగుతోంది. 2021లో తిరుపతిలోని విద్యానగర్‌లో చోరీకి విఫలయత్నం చేసింది. గతేడాది తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బృందావన కాలనీలో గోడదూకి ఓ ఇంట్లోకి ప్రవేశించి చోరీ చేసింది. తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వీరు చోరీలకు పాల్పడుతున్నట్టు పోలీసులు తెలిపారు. వీరు సంచరిస్తుండగా రికార్డయిన సీసీ టీవీ ఫుటేజీని విడుదల చేసిన పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

