Funny video: పిల్లాడి గురించి ప్రశ్నలకు.. తల్లి ఫన్నీ సమాధానాలు.. టీచర్ కి తిక్కలేసి.. ఫన్నీ వీడియో..

|

Sep 29, 2022 | 6:55 PM

అమెరికాలో న్యూయార్క్ మ్యాగజైన్‌లో ఫీచర్స్ రైటర్‌గా పని చేసే ఎమిలీ గోల్డ్.. తన నాలుగేళ్ల బాబు ఇల్యాను ఒక స్కూల్‌లో చదివిస్తోంది. స్వతహాగా నవలలు కూడా రాసే అలవాటున్న


అమెరికాలో న్యూయార్క్ మ్యాగజైన్‌లో ఫీచర్స్ రైటర్‌గా పని చేసే ఎమిలీ గోల్డ్.. తన నాలుగేళ్ల బాబు ఇల్యాను ఒక స్కూల్‌లో చదివిస్తోంది. స్వతహాగా నవలలు కూడా రాసే అలవాటున్న ఎమిలీకి హాస్య చతురత ఎక్కువే. ఈ క్రమంలోనే స్కూల్ నుంచి తన బిడ్డ తీసుకొచ్చిన ఒక ఫామ్‌ ఫిల్ చేయడానికి కూర్చుంది. వాటికి తగినట్లు ఫన్నీ సమాధానాలు రాసింది. సమాధానాలను ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. వాటిలో ‘విద్యలో ఈ ఏడాది మీ పిల్లాడు ఏ విషయంపై ఎక్కువ కష్టపడాలని భావిస్తున్నారు?’ అని ప్రశ్న ఉంది. దానికి ఎమిలీ.. ‘అదెవరికి కావాలి? వాడికి జస్ట్ నాలుగేళ్లే’ అని బదులిచ్చింది. ‘మీ బిడ్డ గురించి ఇంకా ఏమైనా చెప్పదలచుకున్నారా?’ అన్న ప్రశ్నకు ఎమిలీ ఇచ్చిన సమాధానం మరింత నవ్వు తెప్పిస్తుంది. ‘ఇల్యాను మీరు కూడా ప్రేమిస్తారు. వాడు ఎంత మంచి, ముద్దులొలికే పిల్లాడంటే.. ఒక్కోసారి నాకే వీడు నిజంగా నా కొడుకేనా? లేదంటే పుట్టగానే ఎవరైనా మార్చేశారా? అని డౌట్ వస్తుంది. అప్పుడే, నా డెలివరీ ఇంట్లోనే జరిగిన విషయం గుర్తొస్తుంది’ అని ఎమిలీ రాసింది. ఈ సమాధానాలు చదివిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఇకపై తాము కూడా ఆమె సమాధానాలను కాపీ కొట్టేస్తామని అంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Published on: Sep 29, 2022 06:55 PM