Stork – Chick: అయ్యో.. పిల్లలను విసిరేస్తున్న తల్లి కొంగ.. వైరల్ అవుతున్న వీడియో.
తల్లీ బిడ్డల మధ్య మాతృత్వ బంధం మాటల్లో చెప్పలేనిది. అన్ని జీవులు తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటాయి. అయితే ప్రకృతిలో కొన్నిసార్లు విచిత్రమైన సంఘటనలూ జరుగుతుంటాయి. జంతువులు, పక్షులు కొన్ని సందర్భాల్లో తమ పిల్లలను దారుణంగా చంపుతాయి. మానవులు కూడా దీనికి మినహాయింపు కాదు. తాజాగా ఓ కొంగ తన పిల్లలను విసిరేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తల్లీ బిడ్డల మధ్య మాతృత్వ బంధం మాటల్లో చెప్పలేనిది. అన్ని జీవులు తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటాయి. అయితే ప్రకృతిలో కొన్నిసార్లు విచిత్రమైన సంఘటనలూ జరుగుతుంటాయి. జంతువులు, పక్షులు కొన్ని సందర్భాల్లో తమ పిల్లలను దారుణంగా చంపుతాయి. మానవులు కూడా దీనికి మినహాయింపు కాదు. తాజాగా ఓ కొంగ తన పిల్లలను విసిరేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక గూడులో తల్లి కొంగతోపాటు ఐదు పిల్లలున్నాయి. అయితే ఒక పిల్ల పట్ల తల్లి కొంగ వింతగా ప్రవర్తించింది. పొడవైన మక్కుతో పిల్లకొంగ మెడ పట్టుకుని ఎత్తైన గూడు నుంచి కిందకు పడేసింది. ఓ యూజర్ ఈ వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తల్లి కొంగ బలహీన పిల్లను గూడు నుంచి విసిరేసిందని క్యాప్షన్ ఇచ్చారు. ఎత్తులో ఉన్న గూడు నుంచి కింద పడిన ఆ పిల్ల చనిపోయి ఉండవచ్చని భావించారు. ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. బలమైన మిగతా పిల్లల సంరక్షణపై దృష్టి పెట్టేందుకే బలహీన పిల్ల అడ్డు తొలగించేందుకు తల్లి కొంగ ఇలా చేసి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..