Viral: వర్షాలు ఎందుకు కురవడంలేదు..? దేవుడ్ని అడిగి చెప్పండి..! అంటూ లెటర్ రాసిన వ్యక్తి.
దేశంలో కొన్ని రాష్ట్రాల్లో విపరీతంగా వర్షాలు కురుస్తుండగా, కొన్ని రాష్ట్రాల్లో వరుణుడు ముఖం చాటేశాడు. బీహార్ లో ఇప్పటికీ వాన చినుకు లేక ప్రజలు అల్లాడుతున్నారు. దీనిపై ఓ సమాచార హక్కు చట్టం కార్యకర్త కేంద్రానికి ఓ దరఖాస్తు చేశాడు. వర్షాలు ఎందుకు కురవడంలేదో దేవుడ్ని అడిగి చెప్పాలని సమాచార హక్కు చట్టం కింద కేంద్రాన్ని వివరణ కోరాడు. బీహార్ లో వర్షాలు లేక దుర్భిక్ష పరిస్థితులు నెలకొంటున్నాయి.
దేశంలో కొన్ని రాష్ట్రాల్లో విపరీతంగా వర్షాలు కురుస్తుండగా, కొన్ని రాష్ట్రాల్లో వరుణుడు ముఖం చాటేశాడు. బీహార్ లో ఇప్పటికీ వాన చినుకు లేక ప్రజలు అల్లాడుతున్నారు. దీనిపై ఓ సమాచార హక్కు చట్టం కార్యకర్త కేంద్రానికి ఓ దరఖాస్తు చేశాడు. వర్షాలు ఎందుకు కురవడంలేదో దేవుడ్ని అడిగి చెప్పాలని సమాచార హక్కు చట్టం కింద కేంద్రాన్ని వివరణ కోరాడు. బీహార్ లో వర్షాలు లేక దుర్భిక్ష పరిస్థితులు నెలకొంటున్నాయి. దీనిపై ఆందోళన చెందిన ఆర్టీఐ కార్యకర్త రాజ్ కుమార్ ఝా కేంద్ర భూ విజ్ఞాన శాఖకు దరఖాస్తు పంపాడు. బీహార్ లో ఎందుకు వర్షాలు పడడంలేదు? దేవుడ్ని అడిగైనా సరే ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కోండి. అవసరమైతే ఇటీవల ప్రయోగించిన చంద్రయాన్-3 సేవలు ఉపయోగించుకోండి అంటూ దరఖాస్తులో పేర్కొన్నాడు. అంతేకాదు, ఇస్రో చంద్రయాన్-3 చంద్రుడిపై అడుగుపెట్టిన తర్వాత ప్రకృతి కదలికలు ఆగిపోయాయా? అనే విషయంలోనూ తనకు జవాబు కావాలన్నాడు. చంద్రుడి దక్షిణ ధృవంపై తిరిగిన ప్రజ్ఞాన్ రోవర్ కు ఆధునిక సాంకేతిక పరికరాలు అమర్చారని, వాటి వల్ల ప్రకృతి స్తంభించిపోయి ఉంటుందని సందేహం వ్యక్తం చేశాడు. దేవుడి సందేశాన్ని ప్రజ్ఞాన్ రోవర్ సేకరించాలని, ల్యాండర్ సాయంతో ఆ సమాచారాన్ని భూమికి చేరవేయాలని రాజ్ కుమార్ ఝా పేర్కొన్నాడు. లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించైనా సరే తన ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలని స్పష్టం చేశాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
వాసన చూసి క్యాన్సర్‌ను గుర్తిస్తున్న కుక్కలు
కిలాడీ కస్టమర్.. బిల్లు ఎగ్గొట్టేందుకు సీక్రెట్ ప్లాన్..
స్టూడెంట్ చెంపపై కొట్టిన టీచర్.. పాపం.. ఆ విద్యార్థి చెవికి
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
పొలంలో బంగారు నిధులు.. కౌలుకు తీసుకునేందుకు రైతుల పోటీ
బెల్ట్ షాపులకు షాక్ ట్రీట్మెంట్.. మద్యం అమ్మితే కరెంట్ కట్!
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!

