Mother Daughter Suicide: పోలీసుల తీరుతో తల్లీకూతుళ్ల ఆత్మహత్య.. ఇదేంటి అయ్యా పోలీసులే ఇలా చేస్తే ఎలా..?

Updated on: Oct 18, 2022 | 9:58 AM

ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పెడవేగి మండలం గోపన్నపాలెం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఒక యువకుడు 15 ఏళ్ల బాలికను ప్రేమ పేరుతో మోటార్ బైక్ పై కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు.


ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పెడవేగి మండలం గోపన్నపాలెం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఒక యువకుడు 15 ఏళ్ల బాలికను ప్రేమ పేరుతో మోటార్ బైక్ పై కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. దీనిపై బాలిక తల్లి గల్లా దేవి పోలీసులకు పిర్యాదు చేసింది. పోలీసులు కేసు న‌మోదు చేయ‌కుండా బాలికను రప్పించి తల్లికి అప్పగించారు. అయితే నిందితుడిపై కేసు నమోదు చేయకుండా ఎస్‌ఐ దుర్భాషలాడాడని బాలిక తల్లి ఆరోపించింది. ఎస్ఐ తీరుతో తీవ్ర మనస్తాపం తట్టుకోలేక తల్లికూతుళ్లు కూల్ డ్రింక్ బాటిల్‌లో ఎలుకల మందు కలుపుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమకు పోలీసుల ద్వారా న్యాయం జరగదని భావించి ఈ దారుణానికి పాల్పడ్డట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పరిస్థితి గమనించిన గ్రామస్తులు తల్లి కూతుళ్లను చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తలించగా అక్కడ చికిత్స పొందుతూ కూతురు గల్లా అనిత, తల్లి గల్లా దేవి తుది శ్వాస విడిచారు. దీనిపై వేగివాడలో పోలీసులు కేసు న‌మోదు చేసివుంటే తల్లికూతుళ్ళు బ్రతికి ఉండేవారని స్థానికులు ఆందోళనకు దిగారు. బాద్యులైన ఎస్ఐ ని సస్పెండ్ చేయాలలని డిమాండ్ ఎగువాడ రహదారిని మూసివేసి భారీగా ధర్నా చేపట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Published on: Oct 18, 2022 08:52 AM