Most Venomous Snake: ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 110 మిల్లీగ్రాముల విషం విడుదల.

Updated on: Dec 20, 2022 | 9:45 AM

భారతదేశంలో విష సర్పాలు అంటే నాగుపాము, రక్తపింజర, కట్లపాము, కింగ్ కోబ్రాల పేర్లు చెబుతారు. అయితే వీటన్నింటిని మించిన విషసర్పం వేరే ఉంది. అయితే


భారతదేశంలో విష సర్పాలు అంటే నాగుపాము, రక్తపింజర, కట్లపాము, కింగ్ కోబ్రాల పేర్లు చెబుతారు. అయితే వీటన్నింటిని మించిన విషసర్పం వేరే ఉంది. అయితే అది ఆస్ట్రేలియాలో ఉంటుంది. దాని పేరు ఇన్లాండ్ తైపాన్. ఇది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము. ఇది ఒక్క కాటుతో 110 మిల్లీ గ్రాముల విషాన్ని విడుదల చేస్తుందట. దాంతో 100 మంది వ్యక్తులను, రెండున్నర లక్షల ఎలుకలను చంపవచ్చని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ కు చెందిన పరిశోధకులు చెబుతున్నారు.ఈ పాము 1.8 మీటర్ల పొడవు వరకూ పెరుగుతుందట. ఇక వీటి కోరలు అయితే 3 నుంచి 6.2 మి.మీ. పొడవుంటాయట. అయితే అత్యంత ప్రమాదకరమైన ఈ పాములు ఆస్ట్రేలియాలోని అటవీ ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయట. ఇవి పగటిపూట చాలా అరుదుగా కనిపిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. వీటికి రంగులు మార్చే గుణం కూడా ఉందట. ఇన్లాండ్ తైపాన్ పాములు ఋతువులను అనుసరించి చర్మం రంగును మార్చుకుంటాయట. చలికాలంలో ముదురు గోధుమ రంగులోనూ, వేసవిలో లేత గోధుమ రంగులోనూ కనిపిస్తాయట. ఎలుకలు, కోడిపిల్లలూ వీటి ప్రధాన ఆహారం అని చెబుతున్నారు పరిశోధకులు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Partners Relationship: సంసారంలో స్మార్ట్‌గా చిచ్చు.. ఇలాగైతే మొదటికే మోసం..! వైవాహిక జీవితం బాగుండాలి అంటే..

Shocking Video: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా గూడె కట్టేశాయి.. చెవి స్కానింగ్‌లో బయటపడ్డ షాకింగ్ సీన్..

Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..

 

Published on: Dec 20, 2022 09:45 AM