చంద్రుడిపై బెంగళూరు యువకుడు ?? నెట్టింట హల్‌చల్‌ చేస్తున్న వీడియో

చంద్రుడిపై బెంగళూరు యువకుడు ?? నెట్టింట హల్‌చల్‌ చేస్తున్న వీడియో

Phani CH

|

Updated on: Aug 29, 2023 | 8:04 PM

ప్రస్తుతం దేశ ప్రజలంతా చంద్రయాన్ 3 సక్సెస్ మూడ్లో ఉన్నారు. చంద్రయాన్కు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఆస్ట్రోనాట్‌ సూట్ ధరించిన వ్యక్తి.. వేరే గ్రహంపై నడుస్తున్నట్లు అందులో ఉంది. తీరా చూస్తే అతడు నడిచింది రోడ్డుపైన. బెంగళూరులోని రోడ్ల దుస్థితిపై ఓ యువకుడు వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. ఈ వీడియో మూడేళ్ల క్రితం తీయగా..

ప్రస్తుతం దేశ ప్రజలంతా చంద్రయాన్ 3 సక్సెస్ మూడ్లో ఉన్నారు. చంద్రయాన్కు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఆస్ట్రోనాట్‌ సూట్ ధరించిన వ్యక్తి.. వేరే గ్రహంపై నడుస్తున్నట్లు అందులో ఉంది. తీరా చూస్తే అతడు నడిచింది రోడ్డుపైన. బెంగళూరులోని రోడ్ల దుస్థితిపై ఓ యువకుడు వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. ఈ వీడియో మూడేళ్ల క్రితం తీయగా.. ప్రస్తుతం మరోసారి నెట్టింట వైరల్‌ అవుతోంది. 2019లో బెంగళూరులో రోడ్లు గుంతలమయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్యను వెలుగులోకి తీసుకరావాలనుకున్న ఓ యువకుడు వినూత్న రీతిలో వీడియో తీసి నెట్టింట పెట్టాడు. ఆస్ట్రోనాట్‌ సూట్‌ వేసుకుని రోడ్డుపై జాగ్రత్తగా నడుస్తూ.. అంతరిక్షంలోనే ఉన్నట్టుగా భ్రమ కల్పించాడు. ఫస్ట్ ఈ వీడియో చూసిన వారంతా నిజంగానే వేరే గ్రహంపై ఉన్నట్టే అనిపిస్తుంది. అయితే చివరకు వచ్చేసరికి ఆ యువకుడు నడిచేది రోడ్డుపైన అని అర్ధమవుతుంది. ఈ వీడియోను 2019లో తీయగా.. ప్రస్తుతం చంద్రయాన్-3 సక్సెస్తో మరోసారి ఇది వైరల్గా మారింది. కొందరైతే చంద్రుడిపై పరిస్థితులు ఇలా ఉంటాయంటూ ఫేక్‌ పోస్టులు చేస్తున్నారు. మరికొందరు రోడ్లు ఎక్కడ బాగాలేవో.. అక్కడి పేర్లు పెడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో రోడ్ల దుస్థితిని తెలిపేలా చాంద్రయాణగుట్టను చంద్రయాన్‌-3 గుట్ట అంటూ ఓ వ్యక్తి ఈ వీడియోను పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రాణాపాయంలో ఉందికదా అని చిరుత పులిని కాపాడాడు.. ఆ తర్వాత ??

పళ్లతో.. బరువులు ఎత్తుతూ గిన్నిస్‌ రికార్డ్‌ !!

వర్క్‌ప్లేస్‌లో ఇలా కూడా నిద్రపోవచ్చా !! అందుబాటులోకి స్లీపింగ్‌ పాడ్స్‌

Rainbow Waterfall: అరుదైన జాలువారే ఇంద్రధనుస్సు జలపాతం.. ఎక్కడ ఉందో తెలుసా ??