Monkeys Video: రోడ్డుపక్కన కోతుల ఐస్‌క్రీమ్ పార్టీ.. తెగ ఎంజాయ్ చేసిన కోతుల గుంపు.
ఐస్ క్రీం అనగానే చిన్నా, పెద్దా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ ఐస్‌క్రీమ్ అంటే కేవలం మనుషులకే కాదు జంతువులకు కూడా చాలా ఇష్టం. వాటికి ఐస్‌క్రీమ్ దొరకాలే కానీ భలే ఎంజాయ్ చేస్తాయి. ఇదిగో అలాంటిదే ఈ వీడియో. ఓ చోట ఐస్‌క్రీమ్ తింటున్న కోతుల గుంపు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ రోడ్డు పక్కన కొన్ని కోతులు గుంపులుగా ఉన్నాయి.
ఐస్ క్రీం అనగానే చిన్నా, పెద్దా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ ఐస్‌క్రీమ్ అంటే కేవలం మనుషులకే కాదు జంతువులకు కూడా చాలా ఇష్టం. వాటికి ఐస్‌క్రీమ్ దొరకాలే కానీ భలే ఎంజాయ్ చేస్తాయి. ఇదిగో అలాంటిదే ఈ వీడియో. ఓ చోట ఐస్‌క్రీమ్ తింటున్న కోతుల గుంపు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ రోడ్డు పక్కన కొన్ని కోతులు గుంపులుగా ఉన్నాయి. అక్కడికి ఎవరో ఐస్ క్రీమ్స్ ఉన్న బాక్స్ ఒకటి తెచ్చి ఓపెన్ చేసి పెట్టారు. అంతే కోతులన్నీ ఒక్కసారిగా ఆ బాక్స్‌మీదకు దండెత్తాయి. అందినకాడికి ఐస్‌క్రీమ్‌లు పట్టుకొని పక్కకు వెళ్లి కూర్చుని తింటున్నాయి. ఆ వ్యక్తి కొన్ని కోతులకి ఐస్‌క్రీమ్ తినిపించారు కూడా. రంగు రంగుల ఆ ఐస్‌క్రీమ్‌లను కోతులు ఎంత చక్కగా ఆస్వాదిస్తున్నాయంటే.. మీకే కాదు మాకూ ఐస్ క్రీమ్ తినడం వచ్చు అన్నట్టుగా ఉంది. కోతులన్నీ ఆత్రంగా ఐస్‌క్రీం తింటూ ఎంజాయ్ చేసాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఓ వినియోగదారు X లో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటికే 14 లక్షలమందికి పైగా వీక్షించారు. కోతుల సందడి చూసి ఫన్నీగా కామెంట్స్ చేశారు. పార్టీని ఎలా ఆస్వాదించాలో వాటికి బాగా తెలుసునని కొందరంటే..ఈ కోతులకు దంత క్షయం, పళ్లు జివ్వుమనే సమస్యలేవీ లేన్నట్టున్నాయ్..అంటూ ఫన్నీగా కామెంట్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..