పోలీస్ బైక్ నుంచి లిక్కర్ బాటిల్ ను చోరీ చేసిన కోతి
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో పోలీస్ బైక్‌కు ఉన్న బ్యాగ్ నుంచి లిక్కర్ బాటిల్స్‌ను ఒక కోతి చోరీ చేసింది. మూత తీసి మద్యం తాగేందుకు ప్రయత్నించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సోమవారం పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద పలువురు పోలీసులకు చెందిన బైక్‌లు పార్క్ చేసి ఉన్నాయి. ఇంతలో ఒక కోతి ఒక బైక్ వద్దకు వచ్చింది. ఆ బైక్ సైడ్ బ్యాగులో ఉన్న లిక్కర్ బాటిల్‌ను బయటకు తీసింది. బాటిల్ మూత తీసి తాగేందుకు తెగ ప్రయత్నించింది.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో పోలీస్ బైక్‌కు ఉన్న బ్యాగ్ నుంచి లిక్కర్ బాటిల్స్‌ను ఒక కోతి చోరీ చేసింది. మూత తీసి మద్యం తాగేందుకు ప్రయత్నించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సోమవారం పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద పలువురు పోలీసులకు చెందిన బైక్‌లు పార్క్ చేసి ఉన్నాయి. ఇంతలో ఒక కోతి ఒక బైక్ వద్దకు వచ్చింది. ఆ బైక్ సైడ్ బ్యాగులో ఉన్న లిక్కర్ బాటిల్‌ను బయటకు తీసింది. బాటిల్ మూత తీసి తాగేందుకు తెగ ప్రయత్నించింది. వీలు కాకపోవడంతో దానిని కింద పడేసింది. ఆ బ్యాగ్‌లో ఉన్న మరో మద్యం బాటిల్‌ను కూడా బయటకు తీసింది. ఇది గమనించిన పోలీసులు గట్టిగా కేకలు వేయడంతో పాటు ఆ బైక్ వద్దకు వెళ్లారు. దీంతో మరో లిక్కర్ బాటిల్‌ను కూడా కింద పడేసిన ఆ కోతి అక్కడి నుంచి పారిపోయింది. మరోవైపు లిక్కర్ అమ్మకాలు, మద్యపానంపై నిషేధం ఉన్న గాంధీ జయంతి రోజున జరిగిన ఈ సంఘటనపై కాన్పూర్ పోలీస్ జాయింట్ కమిషనర్ ఆనంద్ ప్రకాష్ తివారీ స్పందించారు. లిక్కర్ బాటిల్స్ ఉన్న ఆ పోలీస్ బైక్ ఎవరిదో అన్నది దర్యాప్తు చేస్తామని తెలిపారు. అలాగే కార్యాలయం ఆవరణలో కోతుల బెడదను నివారించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తల్లిని చూసుకోవడం కోసం భార్యను కూడా వదిలేసిన ఛాయ్‌వాలా
తలపై గ్యాస్ సిలిండర్ మోస్తూ మహిళ డ్యాన్స్.. రిస్కీ అవసరమా అంటూ కామెంట్లు..
నాగ్‌పూర్ నుంచి బెంగళూరుకు బయల్దేరిన ఇండిగో విమానంలో తలుపు తెరిచేందుకు యత్నం
బస్సులో ప్రయాణికుడికి గుండెపోటు.. మధ్యలో దించేసిన డ్రైవర్..
Skanda: 5 రోజుల్లో 50 కోట్లు.. దుమ్ములేపుతున్న స్కంద కలెక్షన్స్