కరోనా జాగ్రత్తలు మీకేనా ఏంటి మేము పాటిస్తాం అంటూ మాస్క్ వేసుకొని హంగామా చేసిన కోతి..:Monkey Wear Mask Video.

|

Aug 28, 2021 | 9:59 AM

అసలే కరోనా కాలం.. పైగా రోజుకో కొత్త వెరియెంట్ల రూపంలో వైరస్‌ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. అందుకే తన జాగ్రత్తలు తాను తీసుకుంటున్నట్టుంది ఈ కోతి. ఎవరో పారేసిన ఓ మాస్క్‌ పట్టుకుని ఇలా హంగామా చేసింది. ఏకంగా తన కళ్లు ముక్కు, నోరు చివరికి ముఖం కూడా కనబడకుండా....

కోతి చేష్టలు చాలా సార్లు తలనొప్పిగా మారినా.. కొన్ని సందర్భాల్లో మాత్రం నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా ఓ వానరం చేసిన పనితో నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. పెద్దలు చెప్పిన మాటలను బుద్ధిగా పాటిస్తున్నట్లుగా ఓ కోతి వ్యవహరించిన తీరు అందరినీ అబ్బురపరుస్తోంది. అందరికీ తానే ఆదర్శం అంటూ ముఖానికి మాస్కేసుకుని ఎంచక్కా చక్కర్లు కొడుతోంది.

అసలే కరోనా కాలం.. పైగా రోజుకో కొత్త వెరియెంట్ల రూపంలో వైరస్‌ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. అందుకే తన జాగ్రత్తలు తాను తీసుకుంటున్నట్టుంది ఈ కోతి. ఎవరో పారేసిన ఓ మాస్క్‌ పట్టుకుని ఇలా హంగామా చేసింది. ఏకంగా తన కళ్లు ముక్కు, నోరు చివరికి ముఖం కూడా కనబడకుండా మాస్క్‌ను చుట్టేసుకుంది. నరులకు సోకిన కరోనా.. వారి మధ్య తిరిగే వానరానికి సోకదా అన్నట్లు.. తాను మాత్రం ఎందుకు జాగ్రత్తలు తీసుకోకూడదు అనుకుందో ఏమో గానీ.. ఎంచక్కా మాస్క్ పెట్టుకుని రోడ్డుపై కాసేపు హడావుడి చేసింది.

కాగా, కోతి చేసిన పనిని గమనించిన కొందరు స్థానికులు.. తమ ఫోన్ కెమెరాకు పని చెప్పారు. కోతి కదలికలను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఇంకేముందు.. కోతి హల్‌చల్ చేసినట్లుగానే దాని వీడియో కూడా నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. వీడియోను చూసిన నెటిజన్లు కోతిని చూసైనా మనం బుద్ధి తెచ్చుకోవాలని, కరోనా కట్టడికి మాస్క్ తప్పనసరిగా ధరించాలంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: నడిరోడ్డుపై భారీ అనకొండ.. ఈ రేంజ్ అనకొండ ఎప్పుడు చూడలేదంటూ కామెంట్స్..Viral Video.

ట్రాఫిక్ పోలీస్‌కి లంచంగా నడిరోడ్డుపై ముద్దు యువతి వీడియో వైరల్.. : Police Viral Video.

పోలీసుల్లో మరో యాంగిల్. జేమ్స్ బాండ్ మ్యూజిక్.. దుమ్ములేపుతున్న పోలీసులు.. :Police Music Viral Video.

ఆ సీన్‌ చెప్పగానే భయమేసింది డార్లింగ్.. సుధీర్ బాబు బాడీ పై ప్రభాస్ కామెంట్స్..:Prabhas on Sudheer Babu body Video.