ట్రాఫిక్ పోలీస్‌కి లంచంగా నడిరోడ్డుపై ముద్దు యువతి  వీడియో వైరల్.. : Police Viral Video.

ట్రాఫిక్ పోలీస్‌కి లంచంగా నడిరోడ్డుపై ముద్దు యువతి వీడియో వైరల్.. : Police Viral Video.

Anil kumar poka

|

Updated on: Aug 28, 2021 | 9:45 AM

ట్రాఫిక్‌ పోలీసుల్ని చూడగానే వాహనదారులు అలెర్ట్‌ అవుతుంటారు.. తగిన ధృవపత్రాలు అన్నీ ఉన్నాయంటే.. ఒకే, లేదంటే, చలానా తప్పదు.చాలా మంది ఏవేవో ట్రిక్స్‌ చేస్తూ.. ట్రాఫిక్‌ పోలీసుల నుంచి తప్పించుకోవాలని చూస్తుంటారు. అయితే ఇక్కడో యువతి మాత్రం ట్రాఫిక్ పోలీస్ కి లంచంగా రోడ్డుపై ముద్దు పెట్టింది..

ట్రాఫిక్‌ పోలీసుల్ని చూడగానే వాహనదారులు అలెర్ట్‌ అవుతుంటారు.. తగిన ధృవపత్రాలు అన్నీ ఉన్నాయంటే.. ఒకే, లేదంటే, చలానా తప్పదు. అందుకనే చాలా మంది ఏవేవో ట్రిక్స్‌ చేస్తూ.. ట్రాఫిక్‌ పోలీసుల నుంచి తప్పించుకోవాలని చూస్తుంటారు. అయితే ఇక్కడో యువతి మాత్రం ట్రాఫిక్ పోలీస్ కి లంచమిస్తూ అడ్డంగా బుక్కైంది. అబ్బో ఇందులో కొత్తముంది. మామూలేగా, అనుకుంటున్నారా..? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఆమె లంచంగా ఇచ్చింది డబ్బు కాదు.. ముద్దు. బాబోయ్‌ అమ్మాయి ముద్దు లంచంగా పెట్టిందా..? ఇదే కదా మీ సందేహం.. అవును మరీ.. అందుకే ఈ వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.

ఓ యువతి తప్పు చేయడంతో ట్రాఫిక్ పోలీసులు ఆమెని పట్టుకున్నారు. అయితే ఆమె ఎంత బతిమాలినా ఆమె మాట వినలేదు ట్రాఫిక్‌ పోలీస్‌. అతనికి లంచం ఇవ్వడానికి కూడా ప్రయత్నించింది. అందుకు కూడా ఆయన ససేమిరా అన్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమెను ఆ ట్రాఫిక్ పోలీస్ వదిలేలా కనిపించలేదు. అయితే ఆమె పోలీసు నుండి ఎలాగైనా బయటపడాలని అనుకుంది. దీంతో నడిరోడ్డుపై.. అందరు చూస్తుండగానే ఆ పోలీస్ కి ఏకంగా ముద్దు పెట్టేసింది. ఈ షాకింగ్ ఘటనతో అక్కడున్న వాహనదారులు, ప్రయాణికులు అంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఈ అమ్మాయి ఎంతకి తెగించిందంటూ ముక్కున వేలేసుకున్నారు. ఇది చూసిన నెటిజన్లంతా యువతి చేసిన పనికి.. భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: పోలీసుల్లో మరో యాంగిల్. జేమ్స్ బాండ్ మ్యూజిక్.. దుమ్ములేపుతున్న పోలీసులు.. :Police Music Viral Video.

ఆ సీన్‌ చెప్పగానే భయమేసింది డార్లింగ్.. సుధీర్ బాబు బాడీ పై ప్రభాస్ కామెంట్స్..:Prabhas on Sudheer Babu body Video.

News Watch : ఇఫ్ యుఆర్ మ్యాడ్.. ఐయామ్ యువర్ డాడ్..! మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్… ( వీడియో )

 తాలిబన్లు శవాలను కూడా రేప్ చేస్తారు… సంచలన విషయాలు తెలిపిన అఫ్ఘన్‌ మహిళ..:Taliban Rape Corpses Video.

Published on: Aug 28, 2021 08:53 AM