వింతఘటన.. బ్రహ్మం గారి కాలజ్ఞానం నిజమవుతోందా..? వింతను చూసేందుకు ఎగబడ్డ జనం

Updated on: Aug 11, 2025 | 5:15 PM

బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 8 ఏళ్లు వచ్చేసరికి అపారమైన జ్ఞానం సంపాదించుకున్నారు. ఆధ్యాత్మిక చింతన కలిగిన ఆయన.. జ్ఞానసముపార్జన కోసం దేశ సంచారం చేశారు. ఇక ఆ తర్వాత భవిష్యత్‌లో ఏం జరగబోతుందో తాళపత్ర గ్రంథాల్లో రచించారు. ఆయన చెప్పిన వాటిల్లో చాలా వరకు నిజమవుతున్నాయి.

ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ వింత వెలుగులోకి వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సీతారాంపురం గ్రామపంచాయతీ సీతారాంపురం SC కాలనీలో జొన్నలగడ్డ వెంకటమ్మ అనే గృహిణి ఉదయం లేచి వాకిలి ఊడుస్తూ.. ఓ చింతమొక్క కదలడాన్ని గమనించింది. మొక్క పక్కన ఏమైనా క్రిమి కీటకాలు విష సర్పాలు ఉన్నాయా అని భర్త మస్తాన్ ను పిలిచింది. భార్యాభర్తలు ఇరువురు ఆ చుట్టూ పక్కలా శుభ్రం చేసి చూశారు. చాలా సేపు ఏమి జరిగిందా అని గమనించారు. కీటకాలు కనిపించకపోగా చింత మొక్క తనంతట తాను తిరుగుతూ.. విస్తుపోయే విధంగా కనిపించింది. ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా ఊరంతా పాకింది. దీంతో గ్రామస్తులందరూ గుండ్రంగా తిరుగుతున్న చింత మొక్కను చూడటానికి ఎగబడ్డారు. భారీగా తరలివచ్చిన ఇరుగుపొరుగువారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదేమి వింత అని.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందని స్థానికులు అంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నా భార్యను కాపాడండి.. వరదలో చిక్కుకున్న భర్త ఆవేదన

ఈ వయసులో పెళ్లి చేసుకుంటేనే.. ఆ విషయంలో హ్యాపీ..

Rana Daggubati: బెట్టింగ్ యాప్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన రానా..