Miracle In Shiva Temple video: శివలింగాన్ని తాకిన సూర్యకిరణాలు.. అదే సమయంలో నాగుపాము చేసిన అద్భుతం(వీడియో)

Updated on: Sep 19, 2021 | 4:44 PM

హనుమంకొండలోని సిద్దేశ్వర దేవాలయంలో అద్భుతం జరిగింది. గర్భగుడిలోని శివలింగాన్ని సూర్యకిరణాలు స్పృశించాయి. అంతేకాదు.. అదే సమయంలో ఒక నాగుపాము శివలింగం దగ్గర ప్రత్యక్షమైంది....

హనుమంకొండలోని సిద్దేశ్వర దేవాలయంలో అద్భుతం జరిగింది. గర్భగుడిలోని శివలింగాన్ని సూర్యకిరణాలు స్పృశించాయి. అంతేకాదు.. అదే సమయంలో ఒక నాగుపాము శివలింగం దగ్గర ప్రత్యక్షమైంది. ఇదంతా శివ మహత్యమే అంటున్నారు భక్తులు. ఆ మహత్మ్యాన్ని మీరూ చూసేయండి.గణపతి నవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్న వేళ హనుమకొండ లోని సిద్దేశ్వరాలయంలో అద్భుతం చోటు చేసుకుంది. మానవాళి ప్రత్యక్ష దైవంగా కొలిచే సూర్య భగవానుడు తన కిరణాలతో పరమేశ్వరుని స్పృశించాడు. ఏడాదిలో మూడు రోజులు మాత్రమే ఈ అద్భుతం జరుగుతుంది. గర్భగుడిలోని శివలింగంపై ఉదయబానుడి కిరణాలు దర్శించుకున్న భక్తులు ఇదంతా శివలీలగా భావిస్తున్నారు.

అయితే ఇక్కడ మరో అద్భుతం జరిగింది. స్వయంభువుగా వెలిసిన ఈ పరమేశ్వరుని సూర్య కిరణాలు తాకిన అనంతరం ఒక నాగు పాము అక్కడ ప్రత్యక్షమైంది. శ్రీ మహావిష్ణువు తల్పంగా, పరమ శివునికి ఆభరణంగా ఉండే నాగుపాము ఒక్కసారిగా అక్కడ ప్రత్యక్షం కావడంతో భక్తులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. శివ కేశవులతోపాటు ఆ ఆదిశేషుని దర్శనం కూడా కలిగిందని, ఇదంతా శివ మహత్యమే అంటున్నారు భక్తులు.
మరిన్ని చదవండి ఇక్కడ : chasing scene Viral video: సినీ ఫక్కీలో దొంగలను పట్టుకున్న పోలీసులు.. వైరల్ గా మారిన వీడియో..

 Flyover collapses Video: కూలిన ఫ్లై ఓవర్.. పలువురికి గాయాలు..!ఈ వంతెన స్పెషల్ ఏంటంటే..(వీడియో)

 Tamannaah Video: కొత్త కొత్త పాత్రల్లో నటిస్తే ఆ కిక్కే వేరంటున్న తమన్నా..(వీడియో).

 Khel Duniya With Satya: టెన్నిస్‌స్టార్‌ నడాల్ అంటే మనకెందుకంత ఇష్టం..?(వీడియో)