ఔరా !! పెన్సిల్ మొనపై పవళింపు గణపతి

|

Sep 19, 2023 | 9:52 AM

ఓంకారానికి వారసుడు.. ఆవిష్కరణ కారకుడు వినాయకుడు. ఆది దేవుడి ఆజ్ఞ లేనిదే సృష్టిలో చీమ కూడా కదలదంటారు. అందుకే వినాయక చవితి పర్వదినం సందర్భంగా విఘ్నేశ్వరుడుపై భక్తిని చాటుతున్నాడు అనకాపల్లి జిల్లాకు చెందిన భక్తుడు. ఓ సూక్ష్మ కళాకారుడు అద్భుతమైన కళాఖండాన్ని చెక్కాడు. పెన్సిల్ మొనపై పవళింపు గణపతి సూక్ష్మ శిల్పాన్ని చెక్కి ఔరా అనిపించాడు. నక్కపల్లి మండలం దొడ్డిగోలు గ్రామానికి చెందిన వెంకటేష్ అనే కళాకారుడు సూక్ష్మ కళాఖండాలు రూపొందించడం హాబీ.

ఓంకారానికి వారసుడు.. ఆవిష్కరణ కారకుడు వినాయకుడు. ఆది దేవుడి ఆజ్ఞ లేనిదే సృష్టిలో చీమ కూడా కదలదంటారు. అందుకే వినాయక చవితి పర్వదినం సందర్భంగా విఘ్నేశ్వరుడుపై భక్తిని చాటుతున్నాడు అనకాపల్లి జిల్లాకు చెందిన భక్తుడు. ఓ సూక్ష్మ కళాకారుడు అద్భుతమైన కళాఖండాన్ని చెక్కాడు. పెన్సిల్ మొనపై పవళింపు గణపతి సూక్ష్మ శిల్పాన్ని చెక్కి ఔరా అనిపించాడు. నక్కపల్లి మండలం దొడ్డిగోలు గ్రామానికి చెందిన వెంకటేష్ అనే కళాకారుడు సూక్ష్మ కళాఖండాలు రూపొందించడం హాబీ. ప్రతిసారి.. సందర్భానికి అనుగుణంగా సమాజానికి ఒక చక్కని మెసేజ్ ఇస్తున్నాడు. అనేక మహానుభావులు, దేవతా మూర్తుల విగ్రహాలు పెన్సిల్ పై చెక్కి చిన్న వస్తువులపై తనదైన శైలిలో ప్రత్యేకమైన శిల్పిగా పేరుగాంచాడు. తాజాగా వినాయక చవితి సందర్భంగా గణపతిపై భక్తితో పెన్సిల్ మొనపై అద్భుతమైన కళాఖండాన్ని చెక్కాడు. వెడల్పు పన్నెండు మిల్లీమీటర్లు, ఎత్తు నాలుగు మిల్లీమీటర్లు. సూక్ష్మ కళాఖండం చెక్కడానికి రెండు గంటల సమయం పట్టిందని వెంకటేష్ తెలిపారు. పవళింపు సేవలో తరిస్తున్నట్టు చెక్కిన ఆ విఘ్నేశ్వరుడు చిత్రం ఔరా అనిపిస్తుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: అటు మనవరాలితో చిరు చవితి వేడుక | ఇటు కోడలితో నాగబాబు వినాయకుడి పూజ

Balakrishna: అంతబాధలోనూ.. షూటింగ్‌కు వచ్చిన బాలయ్య

Jawan: వెయ్యి కోట్ల దిశగా జవాన్.. ఆస్కార్‌కి పంపించాలని ఆశ పడుతున్న అట్లీ

Shruti Haasan: శృతి హాసన్‌ వెంటపడి వేధించిన ఆఘంతకుడు

Alien Corpses: ఏలియన్ల శవాలని చెప్పినోడు చేసిన నిర్వాకం ఇదీ