అపర కుబేరుడు.. ఈ ఆటోవాలా.. నెలకు రూ. 3 లక్షల ఆదాయం

Updated on: Oct 07, 2025 | 7:32 PM

పొద్దంతా ఆటో నడిపినా వెయ్యి రూపాయలు రావడం కూడా ఆటో డ్రైవర్లకు కష్టమే. కానీ బెంగళూరులోని ఓ ఆటో డ్రైవర్ స్టోరీ మాత్రం దీనికి భిన్నం. ఎందుకంటే ఆ ఆటో డ్రైవర్ ఐటీ ఉద్యోగులు సైతం ఈర్ష్య పడేలా సంపాదిస్తున్నాడు. ఆటోలో ఓ ప్రయాణికుడికి ఆటో డ్రైవర్ తన ఆదాయం గురించి చెప్పడంతో షాక్ తిన్నాడు. ఈ విషయాన్నంతా ఎక్స్ లో పంచుకున్నాడు.

బెంగళూరులో ఒక సాధారణ ఆటోరిక్షా ప్రయాణం.. ఇంజనీర్ ఆకాష్ ఆనందాని కళ్ళు తెరిపించేలా చేసింది. అక్టోబర్ 4న, ఆకాశ్ ఆనందాని ఒక ఆటో ఎక్కాడు. ఆ ఆటో డ్రైవర్ ఆపిల్ వాచ్, ఎయిర్‌పాడ్‌ను వాడుతున్నట్లు గుర్తించి..ఒక్క క్షణం పాటు షాకయ్యాడు. నెమ్మదిగా అతనితో మాటగలిపాడు. ఈ క్రమంలో సదరు డ్రైవర్‌కు రూ.4 నుంచి 5 కోట్ల విలువైన రెండు ఇళ్లు ఉన్నాయని, వాటి మీద నెలకు రూ. 2-3 లక్షల అద్దెల రూపంలో వస్తుందని తెలుసుకుని మరింత షాకయ్యాడు. ఇవి గాక.. అదనంగా AI స్టార్టప్‌లో కొన్ని పెట్టుబడులు ఉన్నట్లు ఆటో డ్రైవర్ చెప్పటంతో ఆకాష్‌కు మూర్చపోయింనంత పనైంది. తాను కేవలం వీకెండ్‌లోనే ఆటో నడుపుతానని ఆటో డ్రైవర్ చెప్పినట్లు ఆకాశ్ తెలిపాడు. ఇక తనకు ఎదురైన ఈ అనుభవాన్ని ఆకాష్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు రూపంలో రాసుకొచ్చాడు. “ఆటో వాలా భయ్యా తనకు 4-5 కోట్ల విలువైన 2 ఇళ్ళు ఉన్నాయని, అద్దెకు నెలకు 2-3 లక్షల వరకు సంపాదిస్తున్నానని, AI ఆధారిత స్టార్టప్ లో పెట్టుబడిదారుడని చెప్పాడు” అంటూ ఆకాష్ రాసిన పోస్ట్.. కాసేపటికే వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్స్ స్పందిస్తూ.. “బెంగళూరు స్టార్టప్ రాజధాని కావడానికి ఇదే కారణం – ఈ ఊళ్లో ఆటో డ్రైవర్లు కూడా పెట్టుబడిదారులే!” అని ఒకరు కామెంట్ చేయగా, మరొకరు “ఇది బాలీవుడ్ స్క్రిప్ట్ లాగా ఉంది” అని చమత్కరించారు. అయితే, ఆనందాని ఆ కథ నిజమేనని నొక్కి చెప్పాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం.. ఇక పర్యాటకం పరుగులే

కంత్రీ పాక్‌ కన్నింగ్‌ ప్లాన్‌.. మన చాబహర్‌ పోర్టు పక్కనే అమెరికా పోర్టు

Samantha: విద్యార్ధులకు సమంత కీలక సూచన.. చదువుతోపాటు వాటిపై కూడా దృష్టి పెట్టాలి

భార్య వెళ్లిపోయిందని చిన్నమ్మపై పగ.. 13 ఏళ్ల తర్వాత

దూసుకుపోతున్న బంగారం ధర తులం ఎంతంటే

Published on: Oct 07, 2025 07:30 PM