ఒకటో తరగతికీ 4.27 లక్షలు ఫీజు.. మధ్యతరగతి తండ్రి ఆవేదన

ఒకటో తరగతికీ 4.27 లక్షలు ఫీజు.. మధ్యతరగతి తండ్రి ఆవేదన

Phani CH

|

Updated on: Nov 23, 2024 | 8:55 AM

మధ్య తరగతి వారికి నాణ్యమైన విద్య అందని ద్రాక్షగా మారిందంటూ ఓ తండ్రి నెట్టింట ఆవేదన వ్యక్తం చేశాడు. తన కూతురిని చేర్పించాలనుకుంటున్న స్కూల్లో ఒకటో తరగతి ఫీజు ఏకంగా రూ.4.27 లక్షలని వాపోయాడు. నెట్టింట ఆయన పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. తాము ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నామంటూ అనేక మంది తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

జైపూర్‌‌కు చెందిన రిషభ్ జైన్ భారీగా ఉన్న స్కూలు ఫీజు గురించి చెబుతూ ఈ పోస్టు పెట్టారు. తన కూతురు ఒకటో తరగతికి రానుందని ఆయన చెప్పుకొచ్చారు. చిన్నారిని జాయిన్ చేయడానికి ఓ స్కూలును ఎంపిక చేసినట్టు కూడా చెప్పారు. అయితే, అక్కడ ఒకటో తరగతికే రూ.4.27 లక్షలు చెల్లించాల్సి వస్తుందని వాపోయారు. దేశంలో మిడిల్ క్లాస్ వారికి నాణ్యమైన విద్య అందని ద్రాక్షగా మారిపోయిందనీ ఇతర స్కూళ్లల్లో కూడా ఇదే స్థాయిలో ఫీజులు ఉన్నాయనీ పోస్ట్‌లో రాసుకొచ్చాడు రిషభ్‌. ఒకటో తరగతిలో చేర్పించేందుకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.2 వేలు అనీ, అడ్మిషన్ ఫీజు మరో రూ.40 వేలు, రిఫండబుల్ కాషన్ మనీ రూ.5 వేలు. వార్షిక ఫీజు రూ.2.52 లక్షలు, బస్ చార్జీలు రూ. 1.08 లక్షలు, బుక్స్ యూనిఫామ్ రూ.20 వేలు మొత్తం కలిపితే సంవత్సరానికి రూ.4.27 లక్షలు అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఏటా రూ.20 లక్షలు సంపాదిస్తు్న్న వారు కూడా ఈ స్కూల్లో తమ పిల్లలను చదివించేందుకు వెనకాడతారని అన్నాడు. జీతం నుంచి 50 శాతాన్ని ఆదాయపు పన్ను, జీఎస్‌టీ, పెట్రోల్‌పై వ్యాట్, రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, లాండ్ రిజిస్ట్రీ చార్జీలు తదితరాల కింద ప్రభుత్వం వసూలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడాయన. ఇది కాకుండా.. టర్మ్ ఇన్సూరెన్సు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు, పీఎఫ్, ఎన్‌పీఎస్ వంటివి కట్టుకోవాలి. ఇక ఏటా 20 లక్షల ఇన్‌కమ్ ఉన్న వారు 30 శాతం ప్లస్ సెస్ పన్ను కేటగిరీ పరిధిలోకి వస్తారు. కాబట్టి ప్రభుత్వ సంక్షేమ పథకాల పరిధిలోకి రారు. అలా అని ధనికులకు లభించే ఇతర ఉచితాలు లేదా లోన్ల మాఫీ వంటివేవి వీళ్లకు రావు అని వాపోయాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎలన్ మస్క్ కొత్త టెక్నాలజీతో.. అరగంటలో ఢిల్లీ టూ అమెరికా

TOP 9 ET News: పుష్ప2 మళ్లీ వాయిదా అంటూ ప్రచారం.. ఇచ్చిపడేసిన బన్నీ టీం

అలా మాట్లాడితే.. ఆ మనిషిని తప్పుబట్టినట్టు కాదు

చిక్‌ బాబాయ్‌తో ఎలా ఉంటానో మీకెవరికీ తెలియదు !! బన్నీ ఎమోషనల్‌

ఈ ఒక్క మంచి పని చాలు.. నీ సినిమా హిట్టుకొట్టకున్నా కొట్టినట్టే !!