ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..

Updated on: Dec 29, 2025 | 4:43 PM

ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట కేవలం 24 గంటల్లోనే విడిపోయింది. మర్చంట్ నేవీలో భర్త ఉద్యోగ వివరాలు, ఆరు నెలలు ఇంటికి దూరంగా ఉండాలనే షరతు పెళ్లి తర్వాత తెలియడంతో భార్య అంగీకరించలేదు. వివాహానికి ముందు సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల తలెత్తిన ఈ సంఘటన, బంధాలలో పారదర్శకత ఆవశ్యకతను నొక్కి చెబుతుంది.

పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. కానీ ఈ జంట విషయంలో మాత్రం ఆ ముచ్చట కనీసం ఒక్క రోజు కూడా నిలవలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ జంట.. 24 గంటల్లోనే విడిపోయింది. భర్త చెప్పిన ఆ ఒక్క విషయంతో షాక్ అవడం భార్య వంతైంది. ఎవరు ఎంత సర్దిచెప్పినా వారు వినలేదు. పెళ్లి చేసుకున్న కొన్ని గంటల్లోనే వారి మధ్య ఉద్యోగం విషయంలో.. విభేదాలు తలెత్తడంతో పెళ్లి తంతు ముగిసిన వెంటనే విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కారు. మహిళా డాక్టర్ తరపు లాయర్ తెలిపిన వివరాల ప్రకారం.. వారిద్దరిదీ ప్రేమ వివాహం.. అయితే పెళ్లి వరకు అంతా సవ్యంగానే ఉన్నప్పటికీ.. పెళ్లి అయిన వెంటనే భర్త తన వృత్తికి సంబంధించిన అసలు విషయాన్ని బయటపెట్టాడు. ఆ వ్యక్తి డాక్టర్ అయినప్పటికీ.. మర్చంట్ నేవీలో పని చేస్తానని.. డ్యూటీ నిమిత్తం ఏ సమయంలోనైనా షిప్‌పై వెళ్లాల్సి ఉంటుందని తెలిపాడు. ఒకసారి వెళ్తే 6 నెలల పాటు ఇంటికి దూరంగా ఉండాల్సి వస్తుందని చెప్పాడు. అది విని అతడి భార్య షాక్ అయింది. ఇంత ముఖ్యమైన విషయాన్ని పెళ్లికి ముందే ఎందుకు చెప్పలేదని భర్తను భార్య ప్రశ్నించింది. 6 నెలల పాటు భర్తకు దూరంగా ఉండటం తనకు ఇష్టం లేదని ఆమె చెప్పేసింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ పెద్దది కావడంతో.. పెళ్లయిన 24 గంటలకే విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ కేసులో విశేషమేంటంటే.. దంపతుల మధ్య ఎలాంటి హింస లేదా గొడవలు జరగలేదు. కేవలం ఆలోచనా విధానాలు కలవకపోవడం వల్లే విడిపోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లయిన వెంటనే వారు విడిపోయినప్పటికీ.. చట్టపరంగా విడాకులు రావడానికి 18 నెలల సమయం పట్టింది. తాజాగా పరస్పర అంగీకారంతో కోర్టు వారిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. పెళ్లికి ముందే భార్యాభర్తలకు ఒకరి గురించి ఒకరు పూర్తి వివరాలు తెలుసుకోకపోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయని ఈ ఘటన మరోసారి నిరూపించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

షుగర్ పేషంట్స్‌కి స్వీట్ వార్నింగ్.. చెక్కర కంటే బెల్లం యమా డేంజర్ గురూ

షాపింగ్ చేయడం కూడా ఒక రోగమే.. దాని వాళ్ళ కలిగే నష్టాలు తెలిస్తే షాకే

నేటి తాజా వార్తా.. నగరం లో ముసుగు దొంగలు సంచరిస్తున్నారు జాగ్రత్త

BSNL నుంచి అద్భుత ప్లాన్‌!రూ. 251కే 100 GB డేటా

19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే