మట్టి ఇంట్లో నివాసం.. రూ. 2 కోట్ల జాబ్‌ కొట్టిన టెకీ

Updated on: Feb 24, 2025 | 9:19 PM

ఇంజనీరింగ్‌ చదివి గూగుల్‌లో ఉద్యోగం సాధించాలనేది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ల కల. కలలు అందరూ కంటారు. సాధించేది మాత్రం కొందరే. ఐటీ ఉద్యోగాలు సంక్షోభంలో పడిన వేళ అలాంటి ‍డ్రీమ్‌ జాబ్‌ సాధించడం అంటే కత్తి మీద సామే. కానీ ప్రతిష్టాత్మక కంపెనీలో భారీ జీతంతో ఉద్యోగాన్ని సంపాదించాడో యువకుడు.

బీహార్‌లోని జముయి జిల్లాకు చెందిన కంప్యూటర్ ఇంజనీర్ జాక్‌ పాట్‌ కొట్టాడు. గూగుల్‌లో రూ. 2 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగాన్ని సంపాదించాడు. దీంతో అతని కుటుంబం ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతోంది. అభిషేక్ కుమార్ పట్నా ఎన్‌ఐటీ నుంచి బీటెక్‌ చేశాడు. బీటెక్‌ తరువాత 2022లో అమెజాన్‌లో రూ. 1.08 కోట్ల ప్యాకేజీతో కొలువు సాధించాడు. అక్కడ 2023 మార్చి వరకు పనిచేశాడు. ఆ తర్వాత, జర్మన్ విదేశీ మారకపు ట్రేడింగ్ సంస్థలో చేరాడు. అక్కడ పనిచేస్తూనే ఇంటర్వ్యూలకు కష్టపడి ప్రిపేర్‌ అయి గూగుల్‌లో ఏడాదికి 2 కోట్ల రూపాయల జీతంతో ఉద్యోగాన్ని సాధించాడు. గూగుల్‌ లండన్‌ కార్యాలయంలో అక్టోబర్‌లో విధుల్లో చేరనున్నాడు. అభిషేక్‌ మాటల్లో చెప్పాలంటే కంపెనీలో 9 గంటలు పని చేస్తూ, కోడింగ్ నైపుణ్యాలను పెంచుకుంటూ , గూగుల్‌ ఇంటర్వ్యూలకోసం ప్రిపేర్‌ కావడం సవాలుగా అనిపించేదట. ఎక్కడో గ్రామంలో మట్టి ఇంట్లో పుట్టిన తను ఇపుడు కొత్త ఇల్లు నిర్మించుకుంటున్నట్లు సంతోషంగా అన్నాడు. పట్టుదలతో ఏదైనా సాధ్యమే అంటాడు అభిషేక్‌. అభిషేక్ తల్లి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారట.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జామ పండు.. యాపిల్​.. ఆరోగ్యానికి ఏది మంచిది?

తన డ్రాయింగ్‌తో హంతకుడిని పట్టించిన నాలుగేళ్ల చిన్నారి

కొబ్బరి చిప్పలతో 100 రకాల.. గృహాలంకరణ వస్తువులు

రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. టికెట్‌ బుకింగ్‌లో కీలక మార్పులు

ఆ నదిలో బురదను పిసికితే బంగారం దొరుకుతుంది.. బకెట్లతో తోడిపోస్తున్న ప్రజలు