బట్టతలపై జుట్టు మొలిపిస్తామని మందురాసారు..చివరికి ఇలా…!

Updated on: Apr 10, 2025 | 3:11 PM

బట్టతలపై జుట్టు మొలిపిస్తానన్నాడు.. బిగ్‌బాస్‌లో పాల్గొన్న ఓ వ్యక్తి కూడా తాను నెత్తిపై దట్టంగా జుట్టు మొలిపించానని ప్రచారంతో ఊదరగొట్టాడు. పనిలో పనిగా త్వరలోనే హైదరాబాద్‌ వస్తున్నాను.. బట్టతల బాధితులంతా రెడీగా ఉండండి అని కూడా ప్రచారం చేయించుకున్నాడు. దాంతో బట్టతలతో ఇబ్బంది పడుతున్నవారంతా ఈ బట్టతల వైద్యుడి బుట్టలో పడ్డారు.

గంటలతరబడి క్యూలో నిలబడి మరీ గుండుకొట్టించుకుని మందు రాయించుకొని వెళ్లారు. ఆ తర్వాత లబోదిబోమంటూ ఆస్పత్రులకు పరుగెత్తారు. సదరు బట్టతల వైద్యుడు మాత్రం డబ్బులన్నీ మూటగట్టుకొని గుట్టుచప్పుడు కాకుండా అక్కడినుంచి ఉడాయించాడు. ఈ ఘటన హైదరాబాద్‌ పాతబస్తీలో సంచలనంగా మారింది. ఢిల్లీకి చెందిన వకీల్‌ అనే వ్యక్తి బట్టతలతో ఇబ్బందిపడుతున్న యువతను టార్గెట్‌ గా చేసుకొని భారీ మోసానికి తెరతీసాడు. బట్టతలపై సహజంగా వెంట్రుకలు మొలిపిస్తానంటూ తన సోషల్‌మీడియా వేదికగా ప్రకటన చేశాడు. సెలబ్రిటీలకు సైతం గుండుకొట్టి జుట్టు మొలిపించానని చెప్పాడు. ఈ క్రమంలో తాను ఏప్రిల్‌ 6న హైదరాబాద్‌ వస్తున్నానని, తన మిత్రుడికి హైదరాబాద్‌ పాతబస్తీలో సెలూన్‌ షాపు ఉందని అక్కడికి వస్తే బట్టతల బాధితుల సమస్య తీరుస్తానని తన సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించాడు. చెప్పినట్టుగానే ఆదివారం హైదరాబాద్‌కు వచ్చాడు వకీల్‌. బట్టతలపై జుట్టు మొలుస్తుందని ఆశతో వందలమంది వకీల్‌ చెప్పిన సెలూన్‌ షాపుముందు క్యూ కట్టారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అత్తను ఈడ్చి ఈడ్చి కొట్టిన కోడలు.. ఏం జరిగిందంటే..!

మీరు మెనోపాజ్ స్టేజ్‌లో ఉన్నారా.. ఇది మీ కోసమే!

ఎగిరే ఉడుత కనిపించిందోచ్‌.. అంతరించిపోయింది అనుకుంటే..

ICUలో అలేఖ్య చిట్టి.. కన్నీళ్లతో వేడుకుంటూ అక్కాచెల్లి వీడియో

ఉద్యోగం రాలేదని లింక్డ్ఇన్‌లో ‘రెస్ట్ ఇన్ పీస్’ పోస్ట్