Viral: సినిమా థియేటర్‌లో మాస్క్‌ మనుషులు హల్‌చల్‌.. రసాయనాన్ని స్ప్రే చేసిన మాస్క్‌ మనుషులు.

|

Dec 11, 2023 | 9:04 AM

కెనడాలోని సినిమా థియేటర్స్‌లో మాస్క్‌ ధరించిన గుర్తు తెలియని వ్యక్తులు హల్‌చల్‌ చేశారు. గుర్తు తెలియని రసాయనాన్ని థియేటర్లో స్ప్రే చేసి ప్రేక్షకులను అసౌకర్యానికి గురి చేశారు. ఆ సమయంలో థియేటర్‌లో 200 మందికి పైగా ఉన్నారు. స్ర్పే చేయగానే వారిలో కొందరు అస్వస్థతకు గురయ్యారు. చాలామంది దగ్గడం ప్రారంభించారు. ఈ ఘటన మంగళవారం రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో చోటుచేసుకుంది.

కెనడాలోని సినిమా థియేటర్స్‌లో మాస్క్‌ ధరించిన గుర్తు తెలియని వ్యక్తులు హల్‌చల్‌ చేశారు. గుర్తు తెలియని రసాయనాన్ని థియేటర్లో స్ప్రే చేసి ప్రేక్షకులను అసౌకర్యానికి గురి చేశారు. ఆ సమయంలో థియేటర్‌లో 200 మందికి పైగా ఉన్నారు. స్ర్పే చేయగానే వారిలో కొందరు అస్వస్థతకు గురయ్యారు. చాలామంది దగ్గడం ప్రారంభించారు. ఈ ఘటన మంగళవారం రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో చోటుచేసుకుంది. కెనడాలోని గ్రేటర్‌ టొరంటో ప్రాంతంలో హిందీ సినిమాలను ప్రదర్శించే మూడు వేర్వేరు సినిమా హాళ్లలో కలకలం రేగింది. యార్క్‌లోని వౌఘన్‌ సినిమా కాంప్లెక్స్‌లోని థియేటర్‌లో మాస్క్‌ ధరించిన ముగ్గురు వ్యక్తులు గుర్తు తెలియని రసాయనాన్ని స్ప్రే చేశారు. ఈ క్రమంలో థియేటర్‌లోని ప్రేక్షకులు ఊపిరి తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడ్డారు. కొందరు పోలీలసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకునేలోపే దుండగులు పరారయ్యారు. అస్వస్థతకు గురైన కొందరికి పోలీసులు చికిత్స చేయించారు. ఇలాంటి ఘటనే పీల్‌, టొరంటోలోనూ జరిగిందని పోలీసులు తెలిపారు. స్కార్‌బరో టౌన్‌ సెంటర్‌లోని థియేటర్‌లో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి దుర్వాసన వెదజల్లే బాంబును అమర్చినట్లు తమకు ఫోన్‌ కాల్‌ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విద్వేషపూరిత నేరం సహా పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఎవరినీ అరెస్ట్‌ చేయలేదని తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.