త‌ర‌గ‌తి గ‌దిలో విద్యార్థితో పెళ్లి ఘటన.. లేడీ ప్రొఫెస‌ర్ కీల‌క నిర్ణయం

Updated on: Feb 10, 2025 | 5:36 PM

పశ్చిమ బెంగాల్‌లోని మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ తరగతి గదిలో మహిళా ప్రొఫెసర్ ఒక విద్యార్థిని పెళ్లి చేసుకోవడం ఈ మధ్య వైరల్ అయింది. ఇద్దరు పూల దండలు మార్చుకున్నారు. లేడీ ప్రొఫెసర్ నుదుటన విద్యార్థి బొట్టు పెట్టాడు. ఈ ఘటన తాలూకు వీడియో నెట్టింట హల్చల్ చేయడంతో స్పందించిన వర్సిటీ యంత్రాంగం విచారణకు ఆదేశించింది.

అలాగే ఆమెను అధికారులు సెలవుపై పంపారు. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ తాజాగా తన రాజీనామా లేఖను రిజిస్ట్రార్ పార్థకు పంపించారు. తాను మానసికంగా ఇబ్బంది పడుతున్నానని విధుల్లో కొనసాగలేనని ఆమె పేర్కొన్నారు. ఆమె రాజీనామాపై విశ్వవిద్యాలయం త్వరలో నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. క్లాస్ రూమ్‌లో స్టూడెంట్, లేడీ ప్రొఫెసర్ లకు విద్యార్థులు దగ్గరుండి పెళ్లి చేశారు. హిందూ బెంగాలీ వివాహ ఆచారాల ప్రకారం ఈ పెళ్లి జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో యాజమాన్యం విచారణ చేపట్టింది. వర్సిటీ ముగ్గురు సభ్యుల విచారణ ప్యానెల్ ని ఏర్పాటు చేసి ప్రొఫెసర్ నుండి వివరణ కోరింది. అయితే ఇది క్లాస్ రూమ్ లో సైకో డ్రామా అని ప్రొఫెసర్ పేర్కొన్నారు. ఇది అకాడెమిక్ ప్రాజెక్ట్ లో భాగమని అసలు పెళ్లి కాదని చెప్పారు. సైకాలజీ డిపార్ట్‌మెంట్ ప్రతిష్టనే దిగదాల్చడానికి కొందరు వీడియోలను లీక్ చేశారని ప్రొఫెసర్ మండిపడ్డారు. మరోవైపు ఒక మీడియా చానెల్ తో ప్రొఫెసర్ మాట్లాడారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా వీడియోను లీక్ చేశారని ఆరోపించారు. త్వరలోనే నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆమె చెప్పారు. ఇలా చేసిన వారు ఎవరూ ఇప్పుడు తప్పించుకోలేరని ఆమె వెల్లడించారు. తనకు మద్దతు ఇస్తున్న తన భర్తతో సహా తన సన్నిహితులందరికీ ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాయ్‌ ఫ్రెండ్‌ కోసం ఇద్దరు అమ్మాయిల సిగపట్లు

‘ఉప్మా వద్దు.. చికెన్‌ ఫ్రై, బిర్యానీ కావాలి’

ఆస్తి పంపకాల్లాగే అంత్యక్రియల పంపకం.. తండ్రి మృతదేహాన్ని

అందుకే అప్పుడు పవన్ కళ్యాణ్‌తో యాక్ట్ చేయలేదు

ప్రమాదవశాత్తు బావిలో పడిన పెద్దపులి, అడవిపంది… చివరిలో సూపర్‌ ట్విస్ట్‌