మంచి హోటల్, నోరూరించే మెనూ.. లోపల కిచెన్‌లోకి వెళ్తే
హైదరాబాద్‌లోని హోటళ్లు, రెస్టారెంట్లు, దుకాణాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. కొందరు కేటుగాళ్ల తీరు ఏ మాత్రం మారటం లేదు. ఆహార తయారీలో ఇష్టారీతిన కల్తీ పదార్థాలు, డేంజర్ కెమికల్స్ వాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూనే ఉన్నారు. కేసులు నమోదు అవుతున్నా, కఠిన చర్యలు తీసుకుంటున్నా అవేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
ఆహార పదార్థాల కల్తీ, తయారీలో డేంజర్ కెమికల్స్ ని విచక్షణారహితంగా వినియోగిస్తూనే ఉన్నారు. తాజాగా లక్డీకాపూల్, నారాయణగూడలో హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు మెరుపు దాడి చేశారు. ఫుడ్ ఐటమ్స్‌లో హానికరమైన సింథటిక్ కలర్స్ వాడుతున్నట్లు గుర్తించారు. తుప్పుపట్టిన పాత్రలలో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు తేల్చారు. ఒకే ఫ్రిడ్జ్‌లో వెజ్, నాన్ వెజ్‌ని నిల్వ చేస్తుండటంపై సీరియస్ అయ్యారు. అంతేకాదు కిచెన్‌లో అపరిశుభ్ర వాతావరణం, బొద్దింకలు ఉన్నట్లు గుర్తించారు. ఎక్స్‌పైర్ అయిన ఫుడ్ ప్రొడక్ట్స్‌ని వాడుతూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారంటూ హోటల్ అశోక్ ఇండియన్ దర్బార్ సహా పలు రెస్టారెంట్లకు నోటీసులు ఇచ్చారు. అలాగే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిబంధనలకు విరుద్ధంగా ఆహార పదార్థాలను విక్రయిస్తున్న హోటళ్లను సీజ్ చేశారు. ఫుడ్ ఐటమ్స్‌లో కెమికల్స్ వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మొత్తంగా హైదరాబాద్‌లో వరుస ఫుడ్ సేఫ్టీ దాడులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే వారి గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తరగతి గదిలో విద్యార్థితో పెళ్లి ఘటన.. లేడీ ప్రొఫెసర్ కీలక నిర్ణయం
బాయ్ ఫ్రెండ్ కోసం ఇద్దరు అమ్మాయిల సిగపట్లు
‘ఉప్మా వద్దు.. చికెన్ ఫ్రై, బిర్యానీ కావాలి’

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
