రోడ్డెక్కిన రీల్స్ పిచ్చి… ట్రాఫిక్‌లో నోట్లు విసురుతూ వీడియోలు
తమకు ఉన్నంతలో కొందరు పేదవారికి సహాయం చేస్తుంటారు. డబ్బు రూపంలో కానీ, మరో రకంగా గానీ సహాయం చేస్తారు. అది వారి దాతృత్వంగా చెప్పవచ్చు. కానీ ఇలా ధనాన్ని నడిరోడ్డుపై జనాలపైకి విసిరే వారిని ఏమనాలి? వారిది దాతృత్వమా? ఇంకేదైనానా? అలాంటి వ్యక్తే ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. అతని పేరే హర్ష. ఇతనో యూట్యూబర్, ఇన్‌స్టాగ్రామర్ అట.
తమకు ఉన్నంతలో కొందరు పేదవారికి సహాయం చేస్తుంటారు. డబ్బు రూపంలో కానీ, మరో రకంగా గానీ సహాయం చేస్తారు. అది వారి దాతృత్వంగా చెప్పవచ్చు. కానీ ఇలా ధనాన్ని నడిరోడ్డుపై జనాలపైకి విసిరే వారిని ఏమనాలి? వారిది దాతృత్వమా? ఇంకేదైనానా? అలాంటి వ్యక్తే ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. అతని పేరే హర్ష. ఇతనో యూట్యూబర్, ఇన్‌స్టాగ్రామర్ అట. ఏ వీడియోలు పెడతాడో, ఎలాంటి కంటెంట్ ఇస్తాడోగానీ.. కాస్తోకూస్తో అకౌంట్‌లోకి డబ్బు వచ్చిపడుతోంది. ఆ డబ్బునే పెట్టుబడిగా పెట్టి మళ్లీ వీడియోలు చేస్తున్నాడు. ఇప్పుడు గాల్లోకి కరెన్సీ నోట్లు విసురుతూ వీడియోలు చేసాడు. ఆ నోట్ల కోసం జనం ఎగబడుతుంటే చూసి ఆనందిస్తూ.. వీడియో తీసి తన సోషల్ మీడియా ఖాతలో పెడుతున్నాడు. ఇదొక్కటే కాదు.. నడిరోడ్డుపై ప్రమాదకర స్టంట్స్ కూడా చేయడం ఇతనికి అలవాటు. ఇలా గాల్లోకి డబ్బులు విసరడం ఇది ఫస్ట్ టైమ్ కాదు. కరెన్సీ కట్టలను తీసుకొచ్చి ఇలా గాల్లోకి పోస్ట్ చేసి రీల్స్ చేయడం ఇతనికి అలవాటు. ఆ డబ్బును పట్టుకోడానికి జనం ఎగబడతారు. చిన్నపాటి తొక్కిసలాటలు, ట్రాఫిక్ జామ్‌లు ఆ టైమ్‌లో సహజం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇలాగైతే బస్సు నడిపేదేలే.. నడిరోడ్డుపై నిలిపేసిన ఆర్టీసీ డ్రైవర్
పిల్లల హాస్టలా ?? కోతుల హాస్టలా ?? విద్యార్ధులకోసం వండిన ఆహారాన్ని తినేస్తున్న వానరాలు
‘అన్నం వండేవాడు.. మంచిగా ఉండేవాడు’.. కోల్‌కతా ఘటన నిందితుడి తల్లి కీలక వ్యాఖ్యలు