Viral Video: కుక్క కోసం ప్రాణాలకు తెగించాడు.. భారీ వరద నుంచి ఎలా కాపాడాడో చూస్తే మతి పోవాల్సిందే..

|

Apr 23, 2022 | 9:06 PM

నెట్టింట్లో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వచ్చి చేరుతున్నాయి. వీటిలో కొన్ని నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటూ తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో కొన్ని ఆశ్చర్యపరచగా, మరికొన్ని మాత్రం షాకిస్తుంటాయి.

Viral Video: కుక్క కోసం ప్రాణాలకు తెగించాడు.. భారీ వరద నుంచి ఎలా కాపాడాడో చూస్తే మతి పోవాల్సిందే..
Dog Viral Video
Follow us on

నెట్టింట్లో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వచ్చి చేరుతున్నాయి. వీటిలో కొన్ని నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటూ తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో కొన్ని ఆశ్చర్యపరచగా, మరికొన్ని మాత్రం షాకిస్తుంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు మాత్రం అందర్నీ ఆకట్టుకుంటాయి. తాజాగా ఓ కుక్క వీడియో కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. వైరల్ హాగ్ అనే ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ వీడియోను పంచుకున్నాడు. ఒక వ్యక్తి డిగ్గింగ్ మెషిన్ ముందు భాగంలోకి ఎక్కి కాలువ మధ్యలో దిగుతున్నట్లు ఈ వీడియోలో చూడొచ్చు. అతను కుక్క దగ్గరకు వచ్చే వరకు కొన్ని నిమిషాలు వేచి ఉన్నాడు. కుక్క దగ్గరికి రాగానే, అతను దానిని తన చేతులతో పట్టుకుని ప్రొక్లైన్‌తో బయటకు తీశాడు. ఆ తర్వాత మెల్లగా మెషిన్ పైకి లాగి చివరకు కుక్క ప్రాణాన్ని కాపాడాడు. కాలువలో పడిపోయిన కుక్కను తన ప్రాణాలకు తెగించి మరీ ఎంతో రిస్క్ చేసి కాపాడాడు.

ఏప్రిల్ 22న పోస్ట్ చేసిన ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో ఒక రోజులో 11,000 కంటే ఎక్కువ లైక్‌లను పొందింది. 74,000 కంటే ఎక్కువ వ్యూస్‌తో దూసుకపోతోంది. ఈ వీడియోపై 300 మందికి పైగా కామెంట్లు చేస్తూ స్పందించారు. ప్రేక్షకులు ఈ వ్యక్తిని ఎంతగానో కొనియాడుతున్నారు.

ఈ మేరకు “అన్నిచోట్లా మంచి వ్యక్తులు ఉన్నారు,” అని ఒక యూజర్ కామెంట్ చేయగా, “ఇది చూడటం ఒత్తిడితో కూడుకున్నది. అద్భుతమైన రెస్క్యూ!” అంటూ మరొక యూజర్ కామెంట్ చేశాడు. “ఒక మనిషిగా, ఇది నన్ను ఉక్కిరిబిక్కిరి చేసిందని నేను చెప్పగలను. ధన్యవాదాలు. నేను మీ అందరినీ కౌగిలించుకుంటాను.” అంటూ మరొకరు కామెంట్ చేశారు.

Also Read: Viral Photo: ఈ ఫోటోలో ఓ తప్పుంది.! అదేంటో చెప్పగలరా.. గుర్తిస్తే మీరే జీనియస్!

Viral Video: వామ్మో.. ఇలాంటి స్నేహితుడిని పెళ్లికి పిలిస్తే అంతే సంగతులు.. ఏం చేశాడో తెలిస్తే షాకవ్వాల్సిందే..