నా పెళ్లాం నాకు కావాలటూ.. ఏకంగా టవర్‌ ఎక్కిన భర్త

నా పెళ్లాం నాకు కావాలటూ.. ఏకంగా టవర్‌ ఎక్కిన భర్త

Phani CH

|

Updated on: Jul 28, 2022 | 8:43 AM

భార్య- భర్తల మధ్య తగాదాలు రావడం చాలా కామన్.. ఇంటిపోరు తట్టుకోలేక కొంతమంది చేసే పనులు చాలా విచిత్రంగా ఉంటాయి. మొన్నామధ్య భార్య బాధితుల సంఘంకూడా మొదలైంది.

భార్య- భర్తల మధ్య తగాదాలు రావడం చాలా కామన్.. ఇంటిపోరు తట్టుకోలేక కొంతమంది చేసే పనులు చాలా విచిత్రంగా ఉంటాయి. మొన్నామధ్య భార్య బాధితుల సంఘంకూడా మొదలైంది. అయితే తాజాగా ఓ వ్యక్తి తన భార్య పుట్టింట్లోనే ఉందంటూ ఓ విచిత్రమైన పని చేశాడు. తనను కాదని వెళ్లిన తన భార్య కోసం ఓ వ్యక్తి పెద్ద సాహసమే చేశాడు. భార్య కోసం ఏకంగా వంద అడుగుల పొడవైన టవర్ ఎక్కి హంగామా చేశాడు. అతడితో గొడవపడి భార్య సొంత ఇంట్లోనే ఉంటోంది. దాంతో ఆమె కావాలని, లేకుంటే కిందకు దిగనంటూ రచ్చ చేశాడు. అంతేకాదు.. టవర్‌ చివరి ఎత్తుల్లో తాపీగా కూర్చోని, కింద ఉన్న అధికారులతో సెల్‌ఫోన్‌ ద్వారా మాట్లాడాడు. ఇక అతడిని నచ్చజెప్పి కిందికి దించేందుకు స్థానికులు, అధికారులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. నాలుగు గంటల పాటు తీవ్రంగా శ్రమించి, ఎలాగోలా అతడిని కిందకు దించారు అధికారులు. దీంతో పెనుప్రమాదం తప్పింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral: రన్నింగ్‌ లారీ స్ట్రీరింగ్‌ వదిలి.. ఏం చేశాడో చూడండి

Viral Video: మూర్ఛ వచ్చినోడిలా.. ఇదేం డ్యాన్స్‌ రా సామీ

నిజమైన హీరోలంటే వీరు..ఇండస్ట్రీ బాగు కోసం గొప్ప నిర్ణయం

Vijay Deverakonda: కరణ్ అడిగిన బోల్డ్‌ ప్రశ్నకు VD దిమ్మతిరిగే సమాధానం

ఆగిపోయిన పుష్ప, గాడ్‌ఫాదర్, రామ్‌ చరణ్‌ మూవీస్

 

Published on: Jul 28, 2022 08:43 AM