సాయిబాబా పాదాలు మొక్కుతూ ప్రాణం వదిలేశాడు !!

Updated on: Dec 10, 2022 | 9:24 AM

మధ్యప్రదేశ్ , కట్నీ ప్రాంతంలో విచిత్ర సంఘటన జరిగింది. ఓ భక్తుడు సాయిబాబా దర్శనం కోసం ఆలయానికి వెళ్లాడు. అక్కడ అందరితో కలిసి క్యూలో వెళ్లి బాబాను దర్శించుకున్నాడు.

మధ్యప్రదేశ్ , కట్నీ ప్రాంతంలో విచిత్ర సంఘటన జరిగింది. ఓ భక్తుడు సాయిబాబా దర్శనం కోసం ఆలయానికి వెళ్లాడు. అక్కడ అందరితో కలిసి క్యూలో వెళ్లి బాబాను దర్శించుకున్నాడు. అనంతరం సాయిబాబా ముందు పాదాలకు మొక్కుతున్నాడు. అంతే అతను మళ్లీ పైకి లేవలేదు. ఎప్పటికీ అతను అక్కడినుంచి కదలకపోవడంతో మిగతా భక్తులు దణ్ణం పెట్టుకుంటున్నాడు అనుకొని అలా చూస్తూ ఉన్నారు. అయితే ఆలయ సిబ్బంది ఒకరు వచ్చి అతన్ని మిగతా భక్తులకు అవకాశం ఇవ్వాలని చెప్పి అతన్ని తట్టి లేపారు. అయితే అతను లేవకపోవడంతో అనుమానం వచ్చి, పరిశీలించగా అందరూ షాకయ్యారు. ఆ భక్తుడు దర్శనం అనంతరం బాబా పాదాలకు మొక్కుతుండగా గుండెపోటు రావడంతో తుది శ్వాస వదిలాడు.. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

క్లాస్‌రూంలో డాన్స్‌ అదరగొట్టిన టీచర్‌.. మండిపడుతున్న నెటిజన్లు

శివాలయంలో అద్భుతం.. త్రినేత్రాలు ప్రత్యక్షం !!

బైక్‌పై వెళ్తూ స్టంట్‌ చేయబోయిన యువకుడు !! బైక్‌ అదుపుతప్పడంలో ??

త‌న‌ను కాపాడిన యువకులకు లంచ్‌ ఆఫర్‌ చేసిన యూట్యూబ‌ర్.. ఇద్దరు భార‌తీయ హీరోల‌ను క‌లుసుకున్నా అంటూ ట్వీట్‌

వరుడితో యువకుడు సెల్ఫీ.. చివరికి ఊహించని ట్విస్ట్‌ !!

Published on: Dec 10, 2022 09:24 AM
Follow Us