Man Shocking stunt: ఏంది సామీ ఇదీ.. అవి తాళ్లుకాదు.. హైటెన్షన్‌ వైర్లు..! టైంకి కరెంట్‌…

Updated on: Oct 04, 2022 | 7:57 PM

ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లాలోని అమారియా పట్టణంలోని ప్రధాన మార్కెట్‌లో ఒక యువకుడు హల్‌చల్‌ చేశాడు. రద్దీ ప్రదేశంలోని హై వోల్టేజీ వైర్లపై స్వింగ్ చేసాడు. హై ఓల్టెజ్‌ వైర్లను పట్టుకుని


ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లాలోని అమారియా పట్టణంలోని ప్రధాన మార్కెట్‌లో ఒక యువకుడు హల్‌చల్‌ చేశాడు. రద్దీ ప్రదేశంలోని హై వోల్టేజీ వైర్లపై స్వింగ్ చేసాడు. హై ఓల్టెజ్‌ వైర్లను పట్టుకుని వేలాడుతున్న అతన్ని చూసిన స్థానికులు భయంతో హడలెత్తిపోయారు. అరుపులు, కేకలు వేస్తూ అక్కడ జనం భారీ సంఖ్యలో గుమిగూడారు. అందరూ చూస్తుండగానే అతడు వైర్లకు వేలాడుతూ.. విన్యాసాలు చేసాడు. ఇదంతా వీడియో తీసిన స్థానికులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దాంతో ఆ వీడియో కాస్త నెట్టింట వైరల్‌గా మారింది పైగా అక్కడ యువకుడు వేలాడుతున్న విద్యుత్ లైన్లు 11 కెవి హై-టెన్షన్ యూనిట్‌గా తెలిసింది.కాగా పిలిభిత్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని తెలిసింది. దీంతో యువకుడికి పెను ప్రమాదం తప్పింది. కాగా ఈ విషయాన్ని స్థానికులు విద్యుత్‌ శాఖాధికారులకు సమాచారమిచ్చి అప్రమత్తం చేశారు. దాంతో అధికారులు విద్యుత్‌ సరఫరాను మరింత ఆలస్యంగా ప్రారంభించారు. అనంతరం విద్యుత్ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ వ్యక్తిని కిందికి దింపారు. ఆ వ్యక్తిని నౌషాద్‌గా గుర్తించారు. అతను మార్కెట్ ప్రాంతంలో తన బండిలో గాజులు విక్రయిస్తుంటాడని స్థానికులు తెలిపారు. నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియోను చూసి నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పాపులారిటీ కోసం ఇలాంటి సాహసాలు చేసి కుటుంబాలను నట్టేట ముంచొద్దంటూ హితవు పలుకుతునన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Russia bat: ముంచుకొస్తున్న మరో డేంజరస్‌ వైరస్‌.. రష్యాలో కనుగొన్న కొత్తరకం వైరస్.. ఎలా సోకుతుందంటే!

 

Published on: Oct 04, 2022 07:57 PM