పిల్లల కోసం ఐస్‌క్రీమ్, చిప్స్ ఆర్డర్ పెట్టిన తండ్రి.. పార్శిల్‌లో వచ్చింది చూసి మైండ్ బ్లాంక్

|

Sep 02, 2022 | 8:49 AM

తమిళనాడులోని కొయంబత్తూరు జిల్లాలో ఓ వ్యక్తి వింత అనుభవాన్ని చవిచూశాడు. ఒక ప్రైవేట్ ఆంగ్ల వార్తా దినపత్రికలో ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు సదరు వ్యక్తి.

తమిళనాడులోని కొయంబత్తూరు జిల్లాలో ఓ వ్యక్తి వింత అనుభవాన్ని చవిచూశాడు. ఒక ప్రైవేట్ ఆంగ్ల వార్తా దినపత్రికలో ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు సదరు వ్యక్తి. అతను తన పిల్లల కోరికపై ఆగస్టు 27 న ఐస్ క్రీమ్, చిప్స్ కోసం స్విగ్గీలో ఆర్డర్ పెట్టాడు. నిమిషాల్లోనే హోమ్ డెలివరీ వచ్చేసింది. సర్వీస్ భలే ఫాస్ట్‌గా ఉందే అనుకున్నాడు. అయితే పార్శిల్ ఓపెన్ చేయగానే అతడు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. అందులో ఐస్‌క్రీం, చిప్స్‌కు బదులు కండోమ్‌ ప్యాకెట్ ఉంది. బిల్లు మాత్రం స్నాక్ ఐటమ్స్‌కే వేశారు. దీంతో విస్మయానికి గురైన సదరు వ్యక్తి.. ఆ కండోమ్ ప్యాకెట్ ఫోటో తీసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. స్విగ్గీ సంస్థను ప్రశ్నస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో స్వీగ్గీ స్పందించింది. రాంగ్ పార్శిల్ పంపినందుకు సారీ చెప్పింది. ఆర్డర్ నంబర్ తీసుకుని.. డబ్బు రిటన్ చేసినట్లు తెలిపింది. అయితే ఆ కస్టమర్ మాత్రం.. తనకు ఆర్డర్ పెట్టిన ఐస్ క్రీమ్, చిప్స్ పంపాలని కోరాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇళ్ల మధ్య ప్రత్యక్షమైన అతి పెద్ద మొసలి.. భయంతో జనం పరుగులు

అక్కడ భక్తుల కోర్కేలు తీర్చకపోతే దేవతలకు శిక్షలు.. ఎందుకంటే ??

వేగంగా వస్తున్న లోకల్ ట్రైన్.. పట్టాలపై మహిళ పరుగులు.. ఆ తర్వాతే అసలైన ట్విస్ట్ !!

Viral: వామ్మో !! రెండు మొసళ్ల మధ్య ఫైట్‌ ఎప్పుడైనా చూశారా ??

Nikhil: పవన్ కోసం తీసుకున్న ఒక్క నిర్ణయం.. ఈ హీరోను నిలబెడుతోంది

 

Published on: Sep 02, 2022 08:49 AM