మూగ జీవాలే అతని టార్గెట్‌.. విషం పెట్టి మరీ..

|

Nov 28, 2024 | 2:53 PM

నంద్యాల జిల్లాలో వరుసగా ఎద్దులు మృత్యువాత పడటం మిస్టరీగా మారింది. ఎవరైనా కొత్త ఎద్దులను కొని తెచ్చుకున్నా రెండు రోజుల్లో అవి మృత్యువాత పడుతున్నాయి. ఏ క్రూర మృగాలూ వాటిపై దాడి చేయడంలేదు. ఎలాంటి అనారోగ్యమూ కాదు.. అయినా ఎద్దులు చనిపోతున్నాయి. ఇలా దాదాపు మూడేళ్లనుంచి ఆ గ్రామంలోని రైతులకు చెందిన 70 నుంచి 80 ఎద్దుల వరకూ చనిపోయాయి. దీంతో తీవ్ర ఆందోళన చెందిన గ్రామస్తులు ఈ మిస్టరీని ఎలాగైనా ఛేదించాలనుకున్నారు.

ఓ రైతు పశువుల కొట్టాంలో ఎవరికీ తెలియకుండా సీసీ ఎమెరాలు ఏర్పాటు చేశారు. దాంతో ఎద్దుల మృతి మిస్టరీ వీడింది. నంద్యాల జిల్లా డోన్‌ మండలం కమలాపురం గ్రామంలో గత మూడేళ్లుగా ఎద్దులు చనిపోతున్నాయి. గ్రామానికి చెందిన శివరామిరెడ్డి కి చెందిన 14 ఎద్దులు చనిపోయాయి. చనిపోయిన ప్రతిసారీ కొత్త ఎద్దులను కొని తెచ్చుకుంటున్నాడు రైతు. అయితే ప్రతిసారీ ఎద్దులు చనిపోతుండటంతో తీవ్ర ఆవేదన చెందిన శివరామిరెడ్డి ఈసారి ఎద్దులను కొని తెచ్చిన తర్వాత ఎవరికీ తెలియకుండా తన పశువుల కొట్టాంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. ఆరోజు రాత్రి అదే గ్రామంలో వడ్రంగి పనిచేస్తూ జీవించే శంకరాచారి పశువుల కొట్టాంలోకి ఎంట్రీ ఇచ్చాడు. అతను ఎద్దులు తినే గడ్డిలో విషగుళికలు కలిపి వెళ్లిపోయాడు. తెల్లవారే సరికి ఎద్దులు చనిపోయాయి. ఇదంతా అక్కడి సీసీ కెమెరాలో రికార్డయింది. మొదటినుంచి శంకరాచారిపై అనుమానం ఉన్నా ఆధారాలు లేక పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయామని, ఇప్పుడు పక్కా ఆధారాలతో దొరికాడని బాధితులు చెబుతున్నారు. శంకరాచారిని పోలీసులకు అప్పగించారు. అయితే శంకరాచారి ఇలా ఎందుకు ఎద్దులను చంపుతున్నాడనేది మిస్టరీగా మిగిలిపోయింది. శంకరాచారి మానసిక స్థితిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భక్తుడి బ్యాగ్‌లోని సెల్ ఫోన్ కొట్టేసిన కోతి.. పాపం ముప్పతిప్పలు పెట్టి చివరికి ??

Dhanush: నయనతారపై కేసు పెట్టిన ధనుష్

రిలీజ్‌ అయిన 20 రోజుల్లోనే OTTకి వచ్చిన నిఖిల్ కొత్త సినిమా

Top 9 ET News: పుష్ప2కు రూ.300 కోట్ల రెమ్యూనరేషన్ మనోడే టాప్‌

Priyanka Jain: తిరుమలలో ప్రియాంక ప్రాంక్ వీడియో !! హెచ్చరించిన భక్తులు