గోమాతను హింసించాడు.. చివరకు ఏమైందో చూడండి
మూగ జీవాలకు హాని తలపెట్టకుండా ఉన్న వారితో అవి సౌమ్యంగా ఉంటాయి. లేదా విశ్వరూపం ప్రదర్శిస్తాయి. అలాంటిది గోమాత పట్ల ఓ వ్యక్తి కర్కశంగా వ్యవహరించాడు.
మూగ జీవాలకు హాని తలపెట్టకుండా ఉన్న వారితో అవి సౌమ్యంగా ఉంటాయి. లేదా విశ్వరూపం ప్రదర్శిస్తాయి. అలాంటిది గోమాత పట్ల ఓ వ్యక్తి కర్కశంగా వ్యవహరించాడు. తాళ్లతో కట్టేసి విచక్షణా రహితంగా కొట్టాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఆవును కదలకుండా తాళ్లతో కట్టేశాడు. అనంతరం కాళ్లతో విచక్షణా రహితంగా తన్నాడు. ఈ క్రమంలో ఆవు అతని నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. అయినప్పటికీ సదరు వ్యక్తి గోమాత తోక పట్టుకుని కొట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహానికి గురైన గోమాత ఒక్కసారిగా ఆ వ్యక్తిపైకి విరుచుకుపడింది. కొమ్ములతో కుమ్ముతూ.. కింద పడేసి కాళ్లతో తొక్కుతూ సదరు వ్యక్తిని ఉక్కిరిబిక్కిరి చేసేసింది. ఈ ఘటనను అక్కడే ఉన్న పలువురు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో.. ఇది కాస్తా వైరల్ గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు గోమాతపట్ల ఆ వ్యక్తి ప్రవర్తించిన తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇది గిన్నెలు కడిగే స్క్రబ్బర్ అనుకుంటే పొరపాటే.. అదేంటో మీరే చూడండి
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

