24 సార్లు ప్రయత్నించాడు.. రెండు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టేశాడు

|

Sep 27, 2023 | 9:55 AM

చాలామంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటారు. అయితే ఒకటి రెండు సార్లు విఫలమైతే నిరాశ చెంది ఇక మళ్లీ ప్రయత్నించరు. కానీ ఇక్కడ ఓ రైతుబిడ్డ పదే పదే ప్రయత్నించడంతో అతను అనుకున్న లక్ష్యం సాధించాడు. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలన్న పట్టుదలతో.. పరీక్ష రాసిన ప్రతిసారీ విఫలం అవుతున్నా నిరాశ చెందకుండా మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. చివరికి తన శ్రమ ఫలించింది.. ఒకటికాదు రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు.

చాలామంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటారు. అయితే ఒకటి రెండు సార్లు విఫలమైతే నిరాశ చెంది ఇక మళ్లీ ప్రయత్నించరు. కానీ ఇక్కడ ఓ రైతుబిడ్డ పదే పదే ప్రయత్నించడంతో అతను అనుకున్న లక్ష్యం సాధించాడు. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలన్న పట్టుదలతో.. పరీక్ష రాసిన ప్రతిసారీ విఫలం అవుతున్నా నిరాశ చెందకుండా మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. చివరికి తన శ్రమ ఫలించింది.. ఒకటికాదు రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా మాతల గ్రామానికి చెందిన సాగర్‌ అనే వ్యక్తి ఓ రైతుబిడ్డ. తమకున్న రెండెకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే ఆయన లక్ష్యం. 23 సార్లు ప్రభుత్వ ఉద్యోగం కోసం పరీక్షలు రాసారు. రాసినీ ప్రతిసారీ నిరాశే ఎదురైంది. అయినా నిరుత్సాహపడలేదు. విఫలమైన ప్రతిసారీ పాత తప్పులను సరిదిద్దుకొని మళ్లీ ప్రయత్నించారు. ఎట్టకేలకు 24వ ప్రయత్నంలో ఏకంగా రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. మహారాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షల్లో 25వ ర్యాంకు సాధించి ట్యాక్స్‌ అసిస్టెంట్‌గా, మంత్రుల కార్యాలయంలో క్లర్కుగా అవకాశాలు పొందారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Chandramukhi 2: పెద్దమ్మతల్లిని దర్శించుకున్న ‘చంద్రముఖి 2’ టీమ్

Pooja Hegde: స్టార్ క్రికెటర్‌ను పెళ్లాడబోతున్న బుట్ట బొమ్మ ??

మ్యూజియంలో ‘బాహుబలి’ స్టాట్యూ.. ఫొటోను ట్రోల్‌ చేస్తున్న ప్రభాస్‌ ఫ్యాన్స్‌..

Raghava Lawrence: రజినీ కాళ్లు మొక్కిన లారెన్స్‌.. ఎందుకంటే ??

Follow us on