ఈ రోజుల్లో ఏదైనా కొత్తది నేర్చుకోవడానికి, ముందుగా గూగుల్ లేదా యూట్యూబ్‌లో వెతుకుతుంటారు. అయితే తెలియని వాటిని నేర్చుకునేందుకు చాలామంది ఇలా ట్రై చేస్తుంటారు. అయితే, అరటిపండును ఎలా తినాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న పిల్లలకైతే పెద్దలు చెబుతుంటారు. కానీ, పెద్దవాళ్లకు ఏమీ చెప్పాల్సిన అవసరం ఉండదు. తాజాగా ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అవును, తేలికగా ఒలిచి తినగలిగే అరటిపండ్లను ఇలా కూడా తింటారా బాబు అనాల్సిన పరిస్థితి ఈ వీడియో చూస్తే అనిపిస్తుంది. సులభంగా తింటే ఏం మజా వస్తుందని అనుకున్నాడో ఏమో.. ఇలా వెరైటీగా ట్రై చేసి నెటిజన్ల కోపానికి గురయ్యాడు. ఈ వీడియోలో అరటిపండు తినడానికి ఫోర్క్ నైఫ్ వాడుతున్నట్లు చూడొచ్చు.
‘రాణిలా అరటిపండు ఎలా తినాలి’ అని క్యాప్షన్‌తో ఈ వీడియోను నెట్టింట్లోకి వదిలారు. ఈ వీడియోలో, ఒక అరటిపండు ప్లేట్‌లో పెట్టి ఉంచారు. వీడియోలోని వ్యక్తి ఫోర్క్ సహాయంతో ఒక వైపు నుంచి కోస్తాడు. ఆ తరువాత దానిని మరో అంచు నుంచి కత్తిరిస్తాడు. దీని తరువాత, అతను మధ్యలో అరటిపండును చీల్చుతాడు. ఆపై బయట ఉన్న భాగాన్ని తింటున్నట్లు వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
How to eat a banana like a Queen pic.twitter.com/dRusxOIt4C
— Historic Vids (@historyinmemez) May 1, 2022
— Eddy Bernal ♿??????? (@AminDiazMorales) May 2, 2022
https://t.co/4q2eWjppMN pic.twitter.com/hywJIy8Yes
— Amir syafiq ??? (@askara25_) May 2, 2022
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Viral Video: క్లాస్‌రూమ్‌లో లవర్‌తో రొమాన్స్.. అందరూ చూస్తుండగా కిస్.. కట్ చేస్తే..