Man drinks Record: ఇదేం గిన్నిస్ రికార్డు మాస్టారూ.. మందుకొట్టడంలో మొనగాడు.! మాములుగా ఉండదు మరి..

|

Oct 01, 2022 | 9:08 PM

రికార్డులలోకెల్లా.. ఈ రికార్డు వేరయా.. అన్నట్టు తాగుడులోనూ మనోడు చరిత్రకెక్కాడు. మద్యం తాగడంలో కొంతమంది ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ముందుంటారు. తాజాగా.. ఓ వ్యక్తి ఇలాంటి


రికార్డులలోకెల్లా.. ఈ రికార్డు వేరయా.. అన్నట్టు తాగుడులోనూ మనోడు చరిత్రకెక్కాడు. మద్యం తాగడంలో కొంతమంది ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ముందుంటారు. తాజాగా.. ఓ వ్యక్తి ఇలాంటి ప్రయత్నమే చేసి ఏకంగా గిన్నిస్ రికార్డ్ సృష్టించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంగ్లాండ్‌లోని బ్రైటన్‌కు చెందిన నాదన్ క్రింప్ 22 ఏళ్ల యువకుడు 17 గంటల వ్యవధిలోనే సుమారు 67 పబ్‌లకు తిరిగి మందేయంతో ఏకంగా గిన్నిస్ రికార్డ్‌లో చోటు దక్కింది. 24 గంటల వ్యవధిలో అత్యధిక పబ్‌లకు తిరిగి ఆల్కాహాల్ సేవించిన వ్యక్తిగా రికార్డ్ నెలకొల్పాడు. అయితే, గిన్నిస్ బృందం ప్రకారం.. పబ్‌లకు వెళ్లే క్రమంలో ఆల్కాహాలే సేవించవలసిన అవసరం లేదనడంతో నాదన్ క్రింప్ ఒక పబ్‌లో మద్యం, వేరొక పబ్‌లో పానీయం తాగేశాడు. తన స్నేహితులతో కలిసి ప్రతీ పబ్‌కు వెళ్లిన క్రింప్.. మద్యం లేదా పానీయం తాగినట్లుగా రసీదులు, సాక్ష్యాలను కూడా సేకరించాడు. ఇక, ఇదంతా ఒకెత్తయితే.. ఇంత తక్కువ సమయంలో 20 నుంచి 30 లీటర్ల పానీయాలు తాగడం వల్ల.. ఎక్కువసార్లు టాయిలెట్ కెళ్ళడానికే సరిపోయిందని చెప్పుకొచ్చాడు. అయితే ఇలా చేయడానికి ప్రధాన కారణం.. క్యాన్సర్‌తో చనిపోయిన తన కుక్క జ్ఞాపకార్థంతో.. శునకాల ట్రస్టుకు నిధుల సమీకరణకు ఈ అవకాశం ఉపయోగించుకున్నట్లు తెలిపాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Published on: Oct 01, 2022 09:08 PM