గర్ల్‌ఫ్రెండ్ ఖర్చుల కోసం యువకుడి చందాలు.. ఏంటి మామా నీకు ఈ ఖర్మ
ఈ కాలపు యువకులు గర్ల్ ఫ్రెండ్‌తో షికార్లు చేయటం, మంచి బహుమతులతో ఆమెను ఇంప్రెస్ చేయాలని ఎన్నో పాట్లు పడుతుంటారు. జైపూర్‌లోని ఒక యువకుడికీ ఇలా చేయాలనే కోరిక ఉన్నా.. డబ్బు లేకపోవటంతో కొత్త అవతారం ఎత్తాడు. ప్రేమించాలని ఉంది గానీ.. ప్రియురాలి ఖర్చులకు డబ్బు లేదంటూ చందాలు సేకరించటం మొదలుపెట్టాడు.
ఈ కాలపు యువకులు గర్ల్ ఫ్రెండ్‌తో షికార్లు చేయటం, మంచి బహుమతులతో ఆమెను ఇంప్రెస్ చేయాలని ఎన్నో పాట్లు పడుతుంటారు. జైపూర్‌లోని ఒక యువకుడికీ ఇలా చేయాలనే కోరిక ఉన్నా.. డబ్బు లేకపోవటంతో కొత్త అవతారం ఎత్తాడు. ప్రేమించాలని ఉంది గానీ.. ప్రియురాలి ఖర్చులకు డబ్బు లేదంటూ చందాలు సేకరించటం మొదలుపెట్టాడు. చదువు, చికిత్స వంటి వాటికి చందాలు ఇవ్వటం ఎంత ముఖ్యమూ.. ప్రేమను బతికించుకోవటానికి కూడా జనం చందాలివ్వాలంటూ ప్రకటించేశాడు. జైపూర్ వీధుల్లో తిరుగుతూ.. ‘గర్ల్‌ఫ్రెండ్‌తో తిరగాలి.. డొనేషన్ ఇవ్వండి’ అంటూ పోస్టర్ పట్టుకుని తిరుగుతున్నాడు. చందాలిచ్చే వారి సౌలభ్యం కోసం దాని మీద క్యూ ఆర్ కోడ్ కూడా ఇచ్చాడు. అదిచూసిన జనం తెగ నవ్వుకుంటున్నారు. జైపూర్ నగరానికి చెందిన రాహుల్ ప్రజాపత్ అనే యువకుడు తన ప్రియురాలి కోసం చేసిన ఈ వినూత్న ప్రయోగం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్టర్లపై క్యూఆర్ కోడ్ చూసిన కొందరు.. జాలితో కొంత మొత్తాలను అతడికి పంపించారు. కొందరు యువకులు దీనిని …ప్రేమికుల స్టార్టప్ అంటే.. ఇంకొందరు పెరుగుతున్న గర్ల్ ఫ్రెండ్ ఖర్చులకు ఇలాంటివి చేయక తప్పేలా లేదని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు ..‘పాపం ప్రేమికుడు’ అంటూ జాలి చూపుతున్నారు. ‘ప్రేమలో పడ్డాడు.. కానీ ఖర్చులకు భయపడ్డాడు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. వస్తున్నాయి. మరికొందరు ఇతనికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి, ప్రేమ కోసం ఏమైనా చేసేందుకు రెడీగా ఉన్నాడు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పొరపాటున గూగుల్‌లో ఈ విషయాలపై సెర్చ్ చేస్తే.. సీదా జైలుకే
వింతఘటన.. బ్రహ్మం గారి కాలజ్ఞానం నిజమవుతోందా..? వింతను చూసేందుకు ఎగబడ్డ జనం
నా భార్యను కాపాడండి.. వరదలో చిక్కుకున్న భర్త ఆవేదన
ఈ వయసులో పెళ్లి చేసుకుంటేనే.. ఆ విషయంలో హ్యాపీ..
Rana Daggubati: బెట్టింగ్ యాప్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన రానా..