ఏడేళ్లుగా ఆమె జ్ఞాపకాలతోనే.. నిత్యపూజలు, అభిషేకాలు !!

ఏడేళ్లుగా ఆమె జ్ఞాపకాలతోనే.. నిత్యపూజలు, అభిషేకాలు !!

Phani CH

|

Updated on: Aug 25, 2023 | 9:23 AM

అర్ధాంగి కాలం చేసి ఏడేళ్లు అవుతుంది. ఆమె జ్ఞాపకాలతో ఇంకా కాలం వెళ్ళదీస్తున్నాడో భర్త. భార్యకు గుడి కట్టి ఏకంగా నిత్య పూజలు చేస్తున్నారు. ప్రతి ఏటా వర్ధంతి సందర్భంగా అన్నదానం చేసి పేదల కడుపు నింపుతున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామానికి చెందిన జొంగోని ముత్తయ్య అనే వృద్ధుడు.. తన భార్య జంగోని లక్ష్మి ఏడేళ్ల క్రితం చనిపోయింది. ఆమె కోసం సొంత పొలంలో గుడి నిర్మించాడు. అక్కడే నిత్యం పూజలు చేస్తున్నాడు.

అర్ధాంగి కాలం చేసి ఏడేళ్లు అవుతుంది. ఆమె జ్ఞాపకాలతో ఇంకా కాలం వెళ్ళదీస్తున్నాడో భర్త. భార్యకు గుడి కట్టి ఏకంగా నిత్య పూజలు చేస్తున్నారు. ప్రతి ఏటా వర్ధంతి సందర్భంగా అన్నదానం చేసి పేదల కడుపు నింపుతున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామానికి చెందిన జొంగోని ముత్తయ్య అనే వృద్ధుడు.. తన భార్య జంగోని లక్ష్మి ఏడేళ్ల క్రితం చనిపోయింది. ఆమె కోసం సొంత పొలంలో గుడి నిర్మించాడు. అక్కడే నిత్యం పూజలు చేస్తున్నాడు. ప్రతి సంవత్సం వర్ధంతి సందర్భంగా సుల్తానాబాద్‌లోని మానసిక దివ్యాంగుల కేంద్రంలో.. అలాగే వేణుగోపాలస్వామి ఆలయం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఊరి ప్రజలందరికీ అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు. ముత్తయ్య ఉదయం లేవగానే… తన భార్య సమాధి వద్దకు వస్తారు. నీటితో ఆమె విగ్రహాన్ని శుభ్రంగా కడుగుతారు. పువ్వులతో అలంకరిస్తారు. కొబ్బరికాయ కొట్టి హారతులిస్తారు. ఆ తర్వాతే ఆయన ఇతర పనుల్లో నిమగ్నమవుతారు. మళ్ళీ సాయంత్రం మరోసారి పూజలు చేసి ఇంటికి వెళ్ళిపోతారు. లక్ష్మి వర్ధంతి సందర్బంగా కుటుంబ సభ్యులతో కలిసి అన్నదానం నిర్వహిస్తారు. ఇదంతా కూడా ఆయన సంపాదనతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆన్సర్ షీట్లలో డబ్బులు పెట్టిన విద్యార్థి.. ఎందుకంటే ??

ఒక్క రాత్రిలో మొత్తం గ్రామం తుడిచిపెట్టుకుపోయింది !! అసలు ఏం జరిగిందంటే ??

జిరాఫీకి కోపం వస్తే.. రచ్చ రంబోలే !! ఏం చేసిందో మీరే ఒక లుక్ వేయండి

Optical illusion: చీకటి సొరంగమా ?? దట్టమైన అడవా ?? అబ్బురపరుస్తున్న వీడియో

Rare Giraffe: ఇలాంటి జిరాఫీ జన్మించడం ప్రపంచంలోనే తొలిసారి !!